వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi clashes: ఢిల్లీ పరిస్థితిపై ప్రధాని మోడీకి అజిత్ దోవల్ వివరణ..? కేంద్ర వర్గానికి కూడా

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో పరిస్థితిని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ సమీక్షిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి రంగంలోకి దిగిన ఆయన జాఫ్రాబాద్, సీలంపూర్ ప్రాంతంలో పర్యటించారు. అల్లరిమూకలు ఎక్కడ నక్కి ఉన్నారు..? ఆందోళన మూలాలపై ఫోకస్ చేశారు. ఆందోళనలను అణచివేసేందుకు పోలీసులకు పూర్తి స్వేచ్చను కల్పించారు. పారామిలిటరీ బలగాలు కూడా హస్తినలో రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే.

ఢిల్లీలోని తాజా పరిస్థితిని ప్రధాని నరేంద్ర మోడీకి అజిత్ దోవల్ వివరించనున్నారు. పరిస్థితిని అణచివేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకున్నామో తెలియజేస్తారు. తర్వాత కేంద్ర మంత్రివర్గానికి కూడా బ్రీఫ్ చేస్తారు. అల్లర్ల పరిస్థితి ఎలా ఉంది..? పూర్తిగా అణచివేసేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశంపై వివరిస్తారు.

 delhi clashes: NSA Ajit Dival to brief pm modi on Delhi violence

Recommended Video

Janasena Party Leader Pothina Mahesh Slams YS Jagan Over Jagananna Vasathi Deevena Scheme | Oneindia

మంగళవారం అర్ధరాత్రి సీలాంపూర్‌లో అజిత్ దోవల్ పర్యటించారు. ఇక్కడ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. సిచుయేషన్‌ను వెంటనే కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తెలియజేశారు. మరోవైపు ఢిల్లీ ఉద్రిక్త నేపథ్యంలో అమిత్ షా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మంగళవారం నాటి త్రివేండ్రం పర్యటనను కూడా రద్దు చేసుకున్నారు. మరోవైపు ఢిల్లీ ఆందోళనలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. ఇందులో ఒక కానిస్టేబుల్ ఉంగా మిగతా వారు ఆందోళనకారులు. నిన్న 13 మంది ఉండగా.. ఇవాళ ఉదయం మరో నలుగురు చనిపోయారు. తర్వాత మరొకరు చనిపోయినట్టు జీటీబీ ఆస్పత్రి వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.

English summary
delhi clashes: National Security Advisor Ajit Doval will attend the Cabinet Committee on Security meeting on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X