వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

delhi clashes: సీఎం కేజ్రీవాల్ ఇంటి ముందు విద్యార్థుల నిరసన, వాటర్ క్యానన్ల ప్రయోగం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో ఘర్షణలు పీక్ స్టేజీకి చేరాయి. మౌజాబాద్ చౌక్‌లో సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ప్రారంభమైన ఘర్షణల్లో 13 మంది చనిపోగా.. 150 మంది గాయపడ్డారు. ఆందోళనకారుల నిరసనలతో ఈశాన్య ఢిల్లీ అట్టుకుడుతోంది. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటి ముందు కూడా ఆందోళనకకారులు నిరసన చేపట్టారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ క్యానన్లను ప్రయోగించారు.

హోరెత్తిన నినాదాలు..

హోరెత్తిన నినాదాలు..

వందల సంఖ్యలో విద్యార్థులు అరవింద్ కేజ్రీవాల్ ఇంటిముందుకొచ్చారు. కేజ్రీవాల్ బయటకు రండి, తమతో చర్చలు జరపండి అని నినాదాలు చేశారు. ఢిల్లీలో శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టాలని వారు కోరారు. ఈశాన్య ఢిల్లీలో అశాంతికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు.

ఏం జరిగిందో తెలుస్తోంది..?

ఏం జరిగిందో తెలుస్తోంది..?

హింస చెలరేగిన ఈశాన్య ఢిల్లీలోని ప్రాంతాలను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలతో కలిసి సీఎం అరవింద్ కేజ్రీవాల్ సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాదు ఇప్పటివరకు తీసుకున్న చర్యల గురించి వివరించాలని డిమాండ్ చేశారు. సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట ఆందోళన చేస్తున్నవారని వెళ్లిపోవాలని పోలీసులు కోరారు. అయినా వారు వినకపోవడంతో వాటర్ క్యానన్లను ప్రయోగించారు. తర్వాత కూడా ఉన్న కొందరినీ అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

ప్రమాదం అని తెలిసి..?

ప్రమాదం అని తెలిసి..?

పోలీసులు వాటర్ క్యానన్ ప్రయోగించిన తర్వాత గాయపడ్డామని కొందరు విద్యార్థులు మీడియాకు వివరించారు. తమపై పోలీసులు సీఎం కేజ్రీవాల్ ఆదేశంతోనే వాటర్ క్యానన్ ప్రయోగించారని విద్యార్థులు ఆరోపించారు. శీతకాలంలో విద్యార్థులపై వాటర్ క్యానన్ ప్రయోగించడం ప్రమాదకరం, తెలిసి కూడా తమపై ఎందుకు ప్రయోగించారో అర్థం కావడం లేదన్నారు.

Recommended Video

Arvind Kejriwal To Take Oath As Delhi CM @ Ramlila Maidan On February 16 | Oneindia Telugu
ఇవాళ వీరి వంతు...

ఇవాళ వీరి వంతు...

మరోవైపు జామియా మిలియా ఇస్లామియా, జామియా కో ఆర్డినేషన్ కమిటీ బుధవారం ఢిల్లీ సీఎం ఇంటి ఎదుట ప్రదర్శన చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో హింసకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తామని ప్రతినిధులు మీడియాకు వివరించారు.

English summary
Delhi Police used water canon to disperse the crowd from outside Chief Minister Arvind Kejriwal's residence.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X