వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ వాసులకు గుడ్‌న్యూస్ : వరుసగా ఆరోసారి విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని కేజ్రీవాల్ నిర్ణయం

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలు పెంచకూడదని నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీలు పెంచకూడదన్న నిర్ణయం తీసుకోవడం ఇది వరసగా ఆరవసారి కావడం విశేషం. ఈ మేరకు ఆగష్టు 28న ఢిల్లీ విద్యుత్ నియంత్రణ కమిషన్ ఒక ప్రకటన చేసింది. కరోనావైరస్‌ మహమ్మారిని దృష్టిలో ఉంచుకుని 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ నగరంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని ప్రకటన చేసింది.

ఇక ఈ ప్రకటన రాగానే సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. ఢిల్లీ నగరవాసులకు శుభాకాంక్షలు తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఏటా విద్యుత్ ఛార్జీలు పెరుగుతున్న నేపథ్యంలో గత ఆరేళ్లుగా ఒక్క పైసా కూడా ఢిల్లీ ప్రభుత్వం ఢిల్లీ నగరంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదని ట్వీట్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఛార్జీలను కూడా తగ్గించిందని చెప్పారు. ఇది చారిత్రాత్మకం అని అన్నారు. ఢిల్లీలో నిజాయితీతో కూడిన ప్రభుత్వాన్ని మీరు అధికారంలో ఉంచారు కాబట్టే అది సాధ్యమైందన్నారు.

కరోనావైరస్ నేపథ్యంలో మార్చి నెలలో విద్యుత్ ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండబోదని చెప్పిన డీఈఆర్‌సీ.. పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు రెవిన్యూ సమకూరలేదని పేర్కొంది. ఇలా రెవిన్యూ రాని విద్యుత్ కంపెనీల్లో బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్ (బీఆర్‌పీఎల్) , బీఎస్ఈఎస్ యమున పవర్ లిమిటెడ్ (బీవైపీఎల్), టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్), మరియు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (ఎన్‌డీఎంసీ). 2013లో కూడా అరవింద్ కేజ్రీవాల్ అధిక విద్యుత్ చార్జీల పై నిరసన వ్యక్తం చేస్తూ బిజిలీ-పానీ సత్యాగ్రహ పేరుతో ఆమరణ నిరాహార దీక్ష చేశారు. అధికారంలోకి వస్తే దేశంలోనే అతి తక్కువ విద్యుత్ ఛార్జీలు అమలు చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే ఏకంగా 50శాతం మేరా విద్యుత్ ఛార్జీలను తగ్గించారు.

ఇక అప్పటి నుంచి ఆప్ ప్రభుత్వం ప్రజలకు విద్యుత్ ఛార్జీలు భారం కాకుండా ఊరటనిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో అంటే గుజరాత్‌లో 100 యూనిట్లకు రూ.3.5 ఉండగా 101 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు రూ.4.15 ఉన్నింది. పంజాబ్‌లో 100 యూనిట్ల వరకు రూ.4.49 పెరుగగా, 101-200 యూనిట్ల వరకు రూ.6.34 వరకు పెరిగింది. గోవాలో 100 యూనిట్లకు రూ. 1.5 పెరుగగా 101 నుంచి 200 యూనిట్లకు రూ. 2.25 వరకు పెరిగింది. ఇక ఢిల్లీ విషయానికొస్తే 200 యూనిట్ల వరకు సున్నా ఛార్జీగా ఉ:ది. 201 నుంచి 400 యూనిట్ల విద్యుత్ వినియోగిస్తే వచ్చే ఛార్జీపై 50శాతం సబ్సిడీ ప్రకటించింది. ఢిల్లీ రెవిన్యూ గతేడాది ఏప్రిల్ నెలలో రూ.3500 కోట్లు ఉండగా కరోనావైరస్ నేపథ్యంలో ఈ ఏడాది రూ.300 కోట్లకు పడిపోయిందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. రెవిన్యూ లోటు ఉన్నప్పటికీ ఆ భారం విద్యుత్ ఛార్జీలపై ఉండదని సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేస్తూనే 62 లక్షల మంది కన్జ్యూమర్లకు ఊరటనిస్తామని తెలిపారు.

Delhi CM Arvind Kejriwal decides not to hike power tariff for the sixth consecutive year

కరోనా మహమ్మారితో లాక్‌డౌన్ ప్రకటన రావడంతో ఉద్యోగస్తుల వేతనాల్లో కోత విధించడం జరిగింది. కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారని గుర్తు చేశారు. ఈ కష్ట సమయంలో ఆప్ ప్రభుత్వం సామాన్యుడికి అండగా నిలిచిందని చెప్పారు. 2019 సెప్టెంబర్‌లో 14 లక్షల మంది విద్యుత్ వినియోగదారులకు సున్నా కరెంట్ బిల్లులు వచ్చాయని చెప్పారు. 26 లక్షల కుటుంబాలకు సున్నా కరెంటు బిల్లులు 2019 నవంబర్-డిసెంబర్ నెలకు వచ్చాయని చెప్పారు.

విద్యుత్ రేట్లు ఇతర రాష్ట్రాల్లో ఇలా ఉన్నాయి

రాష్ట్రం 0-100 యూనిట్లు 101-200 యూనిట్లు

గుజరాత్: రూ.3.5 రూ.4.15
పంజాబ్ రూ.4.49 రూ.6.34
గోవా రూ.1.5 రూ.2.25
ఉత్తరాఖండ్ రూ.2.80 రూ.3.75
ఢిల్లీ రూ.0.0 రూ.0.0

యూపీ 0నుంచి 150 యూనిట్లకు రూ.5.5 ఉండగా 151 -200 యూనిట్లకు రూ. 6గా ఉంది. అదే ఢిల్లీ విషయానికొస్తే 0 నుంచి 200 యూనిట్లకు సున్నా ఛార్జీ ఉండగా 201 నుంచి 400 యూనిట్ల వరకు 50శాతం సబ్సీడీ ఇస్తోంది.

English summary
Under the leadership of Delhi Chief Minister Shri Arvind Kejriwal, the AAP government has decided to not increase the power tariff in Delhi for the sixth consecutive year in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X