వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

17వ తేదీ తరువాత ఏం చేద్దాం? ఫీడ్‌బ్యాక్ కోరుతోన్న ముఖ్యమంత్రి: టోల్ ఫ్రీ..వాట్సప్ నంబర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న మూడోదశ లాక్‌డౌన్ ఈ నెల 17వ తేదీతో ముగియబోతోంది. గడువు కూడా సమీపించింది. మూడుదశల్లో కట్టుదిట్టంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తోన్నప్పటికీ.. ఎక్కడే గానీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టట్లేదు. రోజురోజుకూ వైరస్ మరింత విస్తరిస్తోంది. కొత్త కేసులు వందల సంఖ్యలో పుట్టుకొస్తున్నాయి. మూడోదశ లాక్‌డౌన్ ముగిసే నాటికి దేశం మొత్తం స్తంభించిపోయి 54 రోజులు అవుతుంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆయువుపట్టుగా చెప్పుకొనే రంగాలన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆర్థిక వ్యవస్థ గాడి తప్పింది. అన్ని రాష్ట్రాలు కుదేల్ అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ను పొడిగించాలా? వద్దా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ వంటి కొందరు లాక్‌డౌన్ ఎత్తేయాలని కోరుతుండగా.. మెజారిటీ రాష్ట్రాల ప్రభుత్వాలు మాత్రం మరి కొంతకాలం పాటు తప్పదని చెబుతున్నారు.

Delhi CM Kejriwal ask the people to send their suggestions post May 17

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ వినూత్న ప్రయోగానికి దిగారు. మూడోదశ లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఏం చేయాలనే విషయంపై ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తున్నారు. అందుబాటులో ఉన్న సోషల్ మీడియాను ఆయన దీనికోసం వినియోగించుకుంటున్నారు. టోల్ ఫ్రీ నంబర్ 1031కు ఫోన్ చేయడం, వాట్సప్ యాప్ నంబర్ 8800007722కు తన అభిప్రాయాన్ని పంపించడం, [email protected] అనే అడ్రస్‌కు ఇమెయిల్ పంపించడం వంటి మార్గాల ద్వారా కేజ్రీవాల్ ప్రజాభిప్రాయాన్ని సేకరిస్తున్నారు.

గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో మంత్రులు, ఎంపీల పర్యటన రోజంతా: అక్కడే భోజనం..నిద్ర: భయాన్ని పోగొట్టేలాగ్యాస్ ప్రభావిత గ్రామాల్లో మంత్రులు, ఎంపీల పర్యటన రోజంతా: అక్కడే భోజనం..నిద్ర: భయాన్ని పోగొట్టేలా

Recommended Video

#Watch : Dust Storm Hits Delhi, Weather Changed Suddenly | Oneindia Telugu

బుధవారం సాయంత్రం 5 గంటల్లోగా తమ అభిప్రాయాలను పంపించాలని ఆయన ఢిల్లీ ప్రజలకు విజ్ఙప్తి చేశారు. మెజారిటీ ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా తన తదుపరి కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అన్నారు. లాక్‌డౌన్, కరోనా వైరస్ నియంత్రణకు సంబంధించి ఢిల్లీ ప్రజలు తమ సూచనలు, సలహాలను తెలియజేయాలని సూచించారు. దేశ రాజధానిలో ప్రస్తుతం ఏడువేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో లాక్‌డౌన్‌ను ఎత్తేయాల్సి వస్తే.. మరింత ఇబ్బందులు ఎదురవుతాయనే ఉద్దేశంతో కేజ్రీవాల్.. ప్రజాభిప్రాయసేకరణకు శ్రీకారం చుట్టారని అంటున్నారు.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal ask the people to send their suggestions post May 17. He said that I want to ask the people of Delhi to send their suggestions on what they want post May 17. He requested the pubilc can send in your suggestions by 5pm tomorrow on the number 1031 , WhatsApp no. 8800007722 or e-mail at delhicm.suggestionsgmail.com.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X