వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కమల్ హాసన్ ఇంటికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్: రాజకీయాలు టార్గెట్, ఆప్ లోకి కమల్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: బహుబాష నటుడు, దర్శకుడు కమల్ హాసన్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం భేటీ కానున్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని పదేపదే గట్టిగా చెబుతున్న కమల్ హాసన్ ను అరవింద్ కేజ్రీవాల్ చెన్నైలోని కమల్ హాసన్ ఇంటికి వెళ్లి కలుసుకోనున్నారు.

రాజకీయ సుడిగుండంలో తమిళనాడు సీఎం: కావేరీ నీటిలో కూల్ గా మహా పుష్కర స్నానం!రాజకీయ సుడిగుండంలో తమిళనాడు సీఎం: కావేరీ నీటిలో కూల్ గా మహా పుష్కర స్నానం!

ఇదే సందర్బంలో కమల్ హాసన్, అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలపై సుధీర్ఘంగా చర్చిస్తారని తమిళనాడుకు చెందిన ఆప్ నాయకుడు మీడియాకు చెప్పారు. తమిళనాడు ఆప్ చెందిన ఓ నాయకుడు మీడియాతో మాట్లాడుతూ కమల్ హాసన్ తో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాల గురించే చర్చిస్తారని, అందుకే ఆయన చెన్నై వస్తున్నారని అన్నారు.

Delhi CM Kejriwal to have political discussions with Kamal Haasan

ఇద్దరి మధ్య ఎలాంటి చర్చ జరిగింది అనే విషయం మాత్రం, కమల్ హాసన్, అరవింద్ కేజ్రీవాల్ మీడియాకు చెబుతారని అన్నారు. తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే ప్రభుత్వం మీద గత కొంత కాలంగా కమల్ హాసన్ మండిపడుతున్న విషయం తెలిసిందే.

తమిళనాడు రసవత్తర రాజకీయాలు: అన్నాడీఎంకేలో ఇరు వర్గాలకు ఊరట, ఉప ఎన్నికలు!తమిళనాడు రసవత్తర రాజకీయాలు: అన్నాడీఎంకేలో ఇరు వర్గాలకు ఊరట, ఉప ఎన్నికలు!

అన్నాడీఎంకే ప్రభుత్వంలోని మంత్రులు అవినీతికి పాల్పడుతున్నారని కమల్ హాసన్ బహిరంగంగానే విమర్శించారు. పొరుగు రాష్ట్రం కేరళలో ఎల్ డీఎఫ్ ప్రభుత్వం అద్బుతంగా పని చేస్తుందని, అక్కడి ప్రజల కష్టాలు తీర్చుతుందని కమల్ హాసన్ కితాబు ఇచ్చారు.

ఇక డీఎంకే పార్టీ నుంచి కమల్ హాసన్ కు పరోక్షంగా మద్దతు ఉంది. డీఎంకే పార్టీతో కమల్ హాసన్ కు మంచి సంబంధాలు ఉన్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో కమల్ హాసన్, అరవింద్ కేజ్రీవాల్ భేటీ కావడం చర్చకు దారితీస్తోంది.

English summary
Delhi: Delhi Chief Minister Arvind Kejriwal will meet Kamal Haasan in Chennai on Thursday and the two will have "political discussions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X