వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల్లో ఇలాంటి వెరైటీ చూశారా? మెట్రో రైల్ 500 కి.మీ పొడగింపు.. కాలుష్యం 300 శాతం తగ్గింపు..

|
Google Oneindia TeluguNews

ఓటర్లను ఆకర్షించడం ఏ రాజకీయ నేతకైనా సవాలు లాంటిదే. అందులో ఆరితేరానని చెప్పకనే చెప్పుకున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. ఎన్నికల్లో హామీలు, వాగ్ధానాలకు సంబంధించి ఇన్నాళ్లూ మనం చాలా చూసుంటాం. ఇంటికో పట్టుచీర.. వెండి కుంకుమభరణి.. మనిషికో వెయ్యి.. అదనంగా బీరు-బిర్యానీ.. పోటీ ఉత్కంఠభరితంగా మారేకొద్దీ ఓటుకు ఇచ్చే నోటు విలువ కూడా పెరగడం.. ఇలాంటి తాయిలాల సంగతి పక్కనపెడితే.. నేతలు దేవుడిమీద ఒట్లు వేయడం.. ప్రాంసరీ నోటు సాక్షిగా ప్రమాణాలు చేయడం తదితర పరిణామాలనూ చూశాం. కేజ్రీవాల్ కొత్తగా ''గ్యారంటీ కార్డు''పేరుతో ప్రజలముందుకొచ్చారు.

ఇది మేనిఫెస్టో కాదు..

ఇది మేనిఫెస్టో కాదు..


ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఏమేం చేస్తామో ఆయా పార్టీలు మేనిఫెస్టోలో హామీలిస్తాయి. కానీ ఆప్ మాత్రం వెరైటీగా మేనిఫెస్టో కంటే ముందు ‘గ్యారంటీ కార్డు'ను తీసుకొచ్చింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిస్తే ప్రజలకు ఏం చేసిపెడతామో మొత్తం 10 పాయింట్లతో ఆప్ ఓ గ్యారంటీ కార్డును రూపొందించింది. ‘‘కేజ్రీవాల్ కా గ్యారంటీ కార్డు'' పేరుతో రూపొందిన దీన్ని ఆదివారం ముఖ్యమంత్రే ఆవిష్కరించారు. ‘‘ఇది మా మేనిఫెస్టో కాదు. ప్రజలకు నేనిస్తున్న గ్యారంటీ. ఇంకో ఐదారు రోజుల్లో పూర్తి వివరాలతో మేనిఫెస్టోను మీ ముదు పెడతాం''అని కేజ్రీవాల్ చెప్పారు.

ఏంటా 10 పాయింట్లు?

ఏంటా 10 పాయింట్లు?

కేజ్రీవాల్ గ్యారంటీ కార్డులో పొందుపర్చిన 10 పాయింట్లలో.. సిటీ అంతటికీ 24 గంటల నిరంతరాయ విద్యుత్, క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై, మొహల్లా క్లినిక్ ల పెంపు, మహిళల భద్రత, యమునా నది ప్రక్షాళన, రవాణారంగాన్ని మెరుగుపరచడం, ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల తగ్గింపు తదితర అంశాలున్నాయి. ‘‘ఒకవేళ ఢిల్లీలో ఆప్ మళ్లీ అధికారంలో వచ్చినా ప్రభుత్వ పథకాలు మార్చి 31 వరకే అమలవుతాయని ప్రతిపక్ష బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. దాన్ని ప్రజలు నమ్మొద్దన్న ఉద్దేశంతోనే మేమీ గ్యారంటీ కార్డు రూపొందించాం. ఇందులో చెప్పిన పథకాలను రాబోయే ఐదేళ్ల వరకు కచ్చితంగా కొనసాగుతాయని హామీ ఇస్తున్నాం''అని ఢిల్లీ సీఎం వివరించారు.

మెట్రో రైల్.. పొల్యూషన్ పై ఫోకస్..

మెట్రో రైల్.. పొల్యూషన్ పై ఫోకస్..

కేజ్రీవాల్ గ్యారంటీ కార్డులో ఢిల్లీ పొల్యూషన్, మెట్రో రైల్ కు సంబంధించిన అంశాలు ప్రముఖంగా ఉన్నాయి. చలికాలంలో ఢిల్లీ వాతావరణం గ్యాస్ ఛాంబర్ మాదిరి ప్రమాదరకంగా మారుతోందని, వచ్చే ఐదేళ్లలో కాలుష్యాన్ని 300 శాతానికి తగ్గిస్తామని ఆప్ గ్యారంటీ ఇచ్చింది. అందులో భాగంగానే యమునా నదిని క్లీన్ చేస్తామనీ తెలిపింది. ఢిల్లీ రవాణా వ్యవస్థలో కీలక పాత్ర మెట్రో రైలుదే. ప్రస్తుతం 391 కిలోమీటర్ల పొడవున్న మెట్రో నెట్ వర్క్ ను 500 కిలోమీటర్లకు పెంచుతామనీ కేజ్రీవాల్ గ్యారంటీ ఇస్తున్నారు.

పోటాపోటీగా ప్రచారం..

పోటాపోటీగా ప్రచారం..

మొత్తం 70 స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు లోక్ సభ సీట్లనూ కైవసం చేసుకున్న బీజేపీ.. అసెంబ్లీలోనూ సత్తా చూపించి అధికారంలోకి రావాలనుకుంటోంది. బీజేపీ, ఆప్ మధ్య ప్రచారం పోటాపోటీగా సాగుతోంది. మూడో పక్షమైన కాంగ్రెస్ ఇంకా అభ్యర్థుల్ని ఖరారుచేసే పనిలోనే బిజీగా ఉంది.

English summary
Chief Minister Arvind Kejriwal on Sunday released a 'guarantee card' listing 10 promises, including free bus rides for students and deployment of 'mohalla marshals' for women's safety, that his Aam Aadmi Party will fulfil if it is re-elected in Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X