వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

త్రివర్ణ పతాకంతో నెమలికి అంత్యక్రియలు:ప్రోటోకాల్ కోసమేనా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చనిపోయిన నెమలికి ఢిల్లీ పోలీసులు త్రివర్ణ పతాకాన్ని కప్పి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన వివాదాస్పదంగా మారింది. సాధారణంగా యుద్దాల్లో వీరమరణం పొందిన జవాన్లకు ఈ తరహంలో అంత్యక్రియలు నిర్వహిస్తారు. కానీ,మృత్యువాత పడిన నెమలికి త్రివర్ణ పతాకాం కప్పి అంత్యక్రియలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది.

డిల్లీలోని హైకోర్టు పరిసరాల్లో గాయాలతో కన్పించిన ఓ నెమలిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది అప్పటికే చనిపోయింది. దానిని త్రివర్ణ పతాకంలో చుట్టి చెక్క పెట్టలో ఉంచారు. మన జాతీయ పక్షి నెమలి కాబట్టి ఇవ్వాల్సిన గౌరవమే ఇచ్చాం.

Delhi cops give tricolour burial to peacock, say its protocol

ఇది ప్రొటోకాల్‌. మున్ముందు ఇలాగే నెమళ్లు చనిపోయినట్లు మా దృష్టికి వస్తే వాటికి కూడా ఇలాగే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు ప్రకటించారు.

చనిపోయిన ఈ నెమలి షెడ్యూల్‌-1కు చెందిన పక్షి. అంటే 1972 వన్యసంరక్షణ చట్టం ప్రకారం ఈ పక్షి సంబంధించిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వమే చూసుకుంటుంది.

ఇలాంటి కోవకు చెందిన నెమళ్లు చనిపోతే రాష్ట్ర అటవీ శాఖ వాటికి పోస్ట్‌మార్టం నిర్వహించి అంత్యక్రియలు నిర్వహిస్తుంది. అలాంటిది చనిపోయిన నెమలిని అటవీ శాఖకు అప్పగించకుండా పోలీసులే అంత్యక్రియలు నిర్వహించడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

English summary
Protocol reserved till now for the funerals of martyred Army personnel and national figures was extended to a peacock in the capital.On Friday, the Delhi Police wrapped the dead bird in tricolour before burying it in a wooden box.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X