వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీబీఐ డీఎస్పీ దేవేందర్ కుమార్‌కు బెయిల్ మంజూరు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీబీఐ డీఎస్పీ దేవేందర్‌ కుమార్‌కు ఢిల్లీ కోర్టు బుధవారం బెయిల్‌ మంజూరు చేసింది. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేష్‌ ఆస్ధానాపై ముడుపుల ఆరోపణల కేసుకు సంబంధించి అరెస్టైన దేవేందర్‌ కుమార్‌కు సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంతోష్‌ స్నేహి మన్‌ రూ 50,000 వ్యక్తిగత పూచీ కత్తుపై బెయిల్‌ మంజూరు చేశారు.

తనను నిర్బంధించడం అక్రమమని, తనకు విముక్తి కల్పించాలని కోరుతూ కుమార్‌ ఢిల్లీ కోర్టులో బెయిల్‌ దరఖాస్తులో పేర్కొన్న విషయం తెలిసిందే. బెయిల్‌ ఇచ్చే క్రమంలో తనకు విధించే షరతులకు కట్టుబడి ఉంటానని కూడా కుమార్‌ కోర్టుకు నివేదించారు.

Delhi court grants bail to CBI DSP Devender Kumar

కాగా, తమపై దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ చట్టబద్ధతను కుమార్‌, ఆస్ధానాలు ఇప్పటికే న్యాయస్ధానంలో సవాల్‌ చేశారు. ఈ కేసులో వీరితో పాటు మనోజ్‌ ప్రసాద్‌, సోమేష్‌ ప్రసాద్‌లను సైతం నిందితులుగా చేర్చారు.

ఇక మరో కేసులో సాక్ష్యాలను రూపుమాపేందుకు దేవేందర్ కుమార్‌ ప్రయత్నించారని దర్యాప్తు ఏజెన్సీ కోర్టుకు తెలిపింది. సీబీఐలో సీనియర్‌ అధికారుల మధ్య వివాదంలో తనను ఇరికించడంతో తాను బాధితుడినయ్యానని కుమార్‌ వ్యాఖ్యానించారు.

English summary
The Delhi’s Patiala House Court Wednesday granted bail to CBI DSP Devender Kumar who was arrested in connection with bribery allegations involving Special Director Rakesh Asthana. Kumar was asked to furnish a personal bond of Rs 50,000 and a surety in the like amount. The CBI had not opposed Kumar’s bail petition.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X