వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

15 క్రేట్లు, రూ.30 వేలు: మామిడి పండ్లు దోచుకున్న కొందరు హస్తిన ప్రజలు, బోరుమన్న చిరువ్యాపారి

|
Google Oneindia TeluguNews

అసలే లాక్‌డౌన్.. దీంతో చిన్న వ్యాపారుల పరిస్థితి దయనీయం. ఇక పండ్లు విక్రయించే పరిస్థితి మరీ ఘోరం. ప్రజలు ఎక్కువ సమయం బయట ఉండటం లేదు.. ఉన్నా బేరం ఆడి కొనుగోలు చేస్తున్నారు. అయితే దేశ రాజధాని ఢిల్లీలో ఓ పండ్ల విక్రేతను జన సమూహం మోసం చేసింది. అవును.. అక్కడ జరుగుతున్న గొడవను ఆసరాగా చేసుకొన.. అతని వద్ద గల మామిడి పండ్లను ఎత్తుకెళ్లిపోయారు. ఒక్కరు కాదు ఇద్దరు కాదు.. పదుల సంఖ్యలో అక్కడికి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

లాక్‌డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..! లాక్‌డౌన్ ఆంక్షలలో శంకుస్థాపనలు ఎలా చేస్తారు..? టీఆర్ఎస్ నేతలపై మండిపడ్డ బండి సంజయ్..!

గొడవను ఆసరాగా చేసుకొని..

గొడవను ఆసరాగా చేసుకొని..

ఢిల్లీ జగత్ పురి ప్రాంతలో చోటే అనే వ్యక్తి మామిడి పండ్లు విక్రయిస్తూ... కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. అయితే బుధవారం అతను పండ్లు అమ్మే దగ్గర గొడవ జరిగింది. లడాయి జరుగుతుందంటే.. అక్కడికి వెళ్లి సర్ది చెబుతుంటాం. అలా ఎవరీ పనిలో వారు బిజీగా ఉండగా సందట్లో సడేమియా అన్నట్టు పాదచారులు, ఆటో డ్రైవర్లు, మిగతా వారు కూడా మామిడి పండ్ల షాపు వద్దకొచ్చారు. అక్కడే గల క్రేట్లలో ఉన్న మామిడి పండ్లను పట్టపగలు ఎత్తుకెళ్లిపోయారు.

15 క్రేట్ల పండ్లు

15 క్రేట్ల పండ్లు

చోటే అనే చిరు వ్యాపారి.. 15 క్రేట్ల మామిడి పండ్లను తీసుకొచ్చారు. దాని విలువ రూ.30 వేలు.. పళ్లు అమ్ముకొని కాస్త లాభం తెచ్చుకుందామనులోపే.. మావనరూపంలో ఉన్న దొంగలుపడీ చోరీ చేశారు. అలా పదుల సంఖ్యలో జనం వచ్చి మామిడి పండ్లను తీసుకెళ్తుంటే ఏం చేయలేని దిక్కుతోచని స్థితిలో చోటే ఉండిపోయారు. అయితే గొడవ జరిగే సమయంలో కొందరు వచ్చి అక్కడినుంచి వెళ్లిపోవాలని కోరారని.. వెళ్లేలోపే ఘటన జరిగిందని చోటే తెలిపారు.

హెల్మెట్లలో పండ్లు

హెల్మెట్లలో పండ్లు

బ్యాగులు లేని వారు.. హెల్మెట్లలో మామిడి పండ్లను తీసుకెళ్లారు. అలా అక్కడికి రావడంతో ట్రాఫిక్ జాం ఏర్పడింది. వారు చేస్తున్న పనిని ఒకరు వీడియో తీసి... సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో తెగ వైరలవుతోంది. అసలే వ్యాపారం లేదు అని.. ఈ సమయంలో చోరీ చేయడంతో తాను నష్టాల్లోకి వెళ్లిపోయానని చోటే చెప్పారు.

English summary
dozens of men in Delhi - passers-by, auto drivers and just about anybody - pounced upon crates of mangoes left unattended by a street vendor and robbed.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X