వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శృతిమించిన ఆప్ ఎమ్మెల్యే ఆగడాలు..?: డబ్బులు ఇవ్వాలని డాక్టర్‌కు బెదిరింపులు, సూసైడ్...

|
Google Oneindia TeluguNews

ఆప్ ఎమ్మెల్యే బెదిరిస్తున్నాడని ఢిల్లీకి చెందిన డాక్టర్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతను, అనుచరుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని రెండు పేజీల సూసైడ్ నోట్ రాశాడు. నోట్ ఆధారంగా ఎమ్మెల్యే, అనుచరుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

డియోల్ ఆప్ ఎమ్మెల్యే ప్రకాశ్ జర్వాల్ ఆగడాలు శృతిమించుతున్నాయి. 2018లో మహిళను బెదిరించిన కేసు మరవకముందే.. మరోసారి తెగించాడు. ఈ సారి వైద్యుడిని టార్గెట్ చేసి వేధింపులకు గురిచేశాడు. డబ్బుల కోసం హరాస్ చేయగా.. ఎమ్మెల్యే, అనుచరుల వేధింపులతో టార్చర్ అనుభవించాడు. చివరికి ఆత్మహత్య శనివారం తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు.

Delhi Doctor Commits Suicide, Blamed AAP MLA In Note: Police

డాక్టర్ రాజేంద్ర సింగ్ ఢిల్లీలోని నెబ్ సారాయ్ ప్రాంతంలో ఉంటారు. ఇతనికి వాటర్ ట్యాంకర్లు ఉన్నాయి. అవి ఢిల్లీ జలమండలి నుంచి నీటిని సేకరించేవి. అయితే డబ్బులు కావాలని ఎమ్మెల్యే ప్రకాశ్ అడగగా.. ఇవ్వకపోవడంతో కక్షకట్టాడు. జలమండలి నుంచి వాటర్ ఇవ్వలేదు. డబ్బుల కోసం హరాస్ చేయడంతో డాక్టర్ భరించలేకపోయాడు. చివరికి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో సూసైట్ నోట్, డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎయిమ్స్ తరలించారు. ఎమ్మెల్యే, అతని అనుచరులపై దోపిడి, ఆత్మహత్యకు ప్రేరేపించడం.. తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

English summary
Delhi doctor Rajendra Singh on Saturday committed suicide allegedly because of harassment by an Aam Aadmi Party MLA, the police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X