వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో అరుదైన చికిత్స: తొడ కొవ్వుతో 23 ఏళ్ల యువతికి వక్షోజాలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో వైద్యులు అరుదైన చికిత్స చేశారు. తొడలోని కొవ్వుతో ఓ 23 ఏళ్ల యువతికి వక్షోజాలు సృష్టించారు. ఈ విషయాన్ని ఆదివారం నాడు వైద్యులు ఓ ప్రకటనలో తెలిపారు. శరీరంలోని కొవ్వుతో ఓ యువతికి వక్షోజం వచ్చేలా చేయడం గమనార్హం.

ఈ ఆపరేషన్ చేసింది ఢిల్లీలోని సర్‌గంగారాం ఆస్పత్రి వైద్యులు. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన 23 ఏళ్ల ఓ యువతి పొలాండ్‌ సిండ్రోమ్‌ (యుక్త వయసులో అమ్మాయిల్లో వక్షోజాలు ఎదగకపోవడం)తో బాధపడుతోంది. దానికి అందుబాటులో ఉన్న చికిత్సల గురించి ఆమె ఇంటర్నెట్‌లో వెతికింది.

Delhi doctors create woman breast using thigh fat

బ్రెస్ట్‌ ఇంప్లాంట్‌పై పలువురు వైద్యులనూ ఆమె కలిసింది. ఇందులో భాగంగా గంగారామ్ ఆసుపత్రి వర్గాలు ఆమె కోరికను నెరవేర్చాయి. శస్త్రచికిత్సలో భాగంగా ఆమె తొడ ప్రాంతంలోని కొవ్వును తీసి ఆమె ఎడమ వక్షస్థలంలో ఇంజెక్ట్‌ చేశామని వివేక్‌ కుమార్‌ తెలిపారు. గతేడాది జూన్‌ 28న ఈ ఆపరేషన్‌ చేసినట్లు వివరించారు. కాగా, వక్షోజాల నిర్మాణంలో లేటెస్ట్ టెక్నాలజీ ఇటీవలే భారత్‌కు వచ్చిందని వివేక్ కుమార్ చెప్పారు.

English summary
Doctors here have successfully constructed a natural breast from body fats taken from the thighs of a 23-year-old woman, a statement said on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X