• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Delhi Results 2020 live: కాంగ్రెస్‌ను కాపాడే నేత లేరు.. ఢిల్లీ ఓటమి తర్వాత బాంబు పేల్చిన కపిల్

|

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 62 సీట్లు గెలుచుకోగా బీజేపీ, కాంగ్రెస్ సహా ఇతర పార్టీలకు గట్టి షాకిచ్చింది. బీజేపీ 8 సీట్లకే పరిమితం కాగా.. కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని పరిస్ధితి నెలకొంది. ఆ పార్టీ 67 మంది అభ్యర్థులు డిపాజిట్ కోల్పోయారు.

Delhi Election Results 2020 live updates

ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినట్టు ఢిల్లీ ఫలితాలు వచ్చాయి. ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుతో ఊడ్చేసింది. ఆప్ హవాకు మిగతా పార్టీలు తుడుచుకుపెట్టుకు పోయాయి.

Newest First Oldest First
6:59 PM, 12 Feb
కేజ్రీవాల్‌పై ఓపీ శర్మ ధ్వజం
అరవింద్ కేజ్రీవాల్ అక్రమార్కుడు. టెర్రరిస్టులతో సంబంధాలున్నాయి. పాకిస్థాన్ ఆర్మీకి అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తాడు. టుకడే టుకుడే గ్యాంగ్‌కు మద్దతు ఇస్తాడు అంటూ బీజేపీ నేత, విశ్వాస్ నగర్ ఎమ్మెల్యే ఏపీ శర్మ తీవ్ర ఆరోపణలు చేశాడు.
3:09 PM, 12 Feb
కాంగ్రెస్‌ను కాపాడే నేత పార్టీలో లేరు
పార్టీని ముందుకు నడిపించే నేత కాంగ్రెస్‌లో లేరు. ఢిల్లీలో దారుణమైన ఓటమి తర్వాత సీనియర్ నేత కపిల్ సిబాల్
2:01 PM, 12 Feb
షీలా దీక్షిత్ హయాంలోనే పతనం
షీలా దీక్షిత్ సీఎంగా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది. ఆమె హయాంలోనే కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఆప్ పార్టీ వైపు వెళ్లింది. ఆప్ చేజిక్కించుకొన్న ఓటు బ్యాంకును మళ్లీ వెనక్కి రాబట్టలేని పరిస్థితి నెలకొన్నది.. కాంగ్రెస్ నేత పీసీ చాకో
1:30 PM, 12 Feb
నైతిక బాధ్యతగా రాజీనామా
ఢిల్లీలో పార్టీ దారుణమైన వైఫల్యానికి నైతిక బాధ్యతను వహిస్తూ రాజీనామా చేసిన రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి పీసీ చాకో.
11:04 AM, 12 Feb
ఢిల్లీ
ఫిబ్రవరి 16న ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
9:53 AM, 12 Feb
ఢిల్లీ
దగ్గరివారితో సన్నిహితులతో కేజ్రీవాల్ మంతనాలు
9:00 AM, 12 Feb
ఢిల్లీ
లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలవనున్న ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్. అనంతరం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కానున్న కేజ్రీవాల్
8:36 AM, 12 Feb
అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో మార్పు చేరికలపై ఉత్కంఠ నెలకొంది. కొత్తగా ఎవరికీ బెర్త్ కేటాయిస్తారోననే టెన్షన్ నెలకొంది.
8:27 AM, 12 Feb
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన 8 మంది ఆమ్ ఆద్మీ పార్టీ మహిళ నేతలు
8:18 AM, 12 Feb
ఎమ్మెల్యే కాన్వాయ్ కాల్పులపై పోలీసులు
దుండగులు కాల్పులు జరిపింది, ఇద్దరు కార్యకర్తల లక్ష్యంగానే తప్ప ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాదు: ఢిల్లీ సౌత్ వెస్ట్ అడిషనల్ డీసీపీ ప్రతాప్ సింగ్
8:13 AM, 12 Feb
కాల్పులపై ఎమ్మెల్యే నరేశ్ స్పందన
కాల్పులు జరిపిన దుండగులను పోలీసులు వెంటనే అరెస్ట్ చేయాలి: ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్
8:07 AM, 12 Feb
మూడోసారి సీఎంగా
మూడోసారి సీఎంగా
మూడోసారి ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్
8:06 AM, 12 Feb
ఢిల్లీలో నిజమైన ఎగ్జిట్ పోల్ అంచనాలు, ఆప్‌కే పట్టం కట్టిన సర్వే సంస్థలు
8:04 AM, 12 Feb
కాల్పుల కలకం
ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు
8:03 AM, 12 Feb
ఎఫ్ఐఆర్ నమోదు
ఆప్ ఎమ్మెల్యే నరేశ్ యాదవ్ కాన్వాయ్‌పై కాల్పులు జరిపిన ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు
8:00 AM, 12 Feb
ఈ నెల 14 లేదా 16వ తేదీల్లో ఢిల్లీ సీఎంగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం
11:53 PM, 11 Feb
బుధవారం కేజ్రీవాల్ నివాసం భేటి కానున్న ఆప్ ఎమ్మెల్యేలు
లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకోనేందుకు బుధవారం కేజ్రీవాల్ నివాసం భేటి కానున్న ఆప్ ఎమ్మెల్యేలు..
11:40 PM, 11 Feb
70 సీట్ల ఫలితాలను ప్రకటించిన ఈసీ
ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి 70 సీట్ల ఫలితాలను ప్రకటించిన ఈసీ.. ఆప్ 62, బీజేపీ 8 స్థానాల్లో విజయం
11:33 PM, 11 Feb
చంద్రబాబు అభినందన
ఇంతకు ముందు లానే అదే అంకితభావంతో ఢిల్లీకి కేజ్రీవాల్ సేవలందిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.. చంద్రబాబు
10:58 PM, 11 Feb
ప్రధానికి కేజ్రీవాల్ థ్యాంక్స్
ప్రధాని మోదీ అభినందనకు బదులుగా థ్యాంక్స్ చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్
10:29 PM, 11 Feb
ఆతీషి గెలుపు
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, కల్కాజీ నియోజకవర్గ అభ్యర్థి ఆతీషి 11393 ఓట్ల మెజారిటీతో గెలుపు
10:18 PM, 11 Feb
సుభాష్ చోప్రా రాజీనామా
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో దారుణమైన వైఫాల్యానికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ పదవికి రాజీనామా చేసిన సుభాష్ చోప్రా
9:44 PM, 11 Feb
రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి
న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి గెలిచిన అరవింద్ కేజ్రీవాల్.. రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ధ్రువీకరణ పత్రాన్ని స్వీకరిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్
8:44 PM, 11 Feb
ఆమ్ ఆద్మీ పార్టీ 55 స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది. మరో 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
8:16 PM, 11 Feb
బీజేపీ 7 స్థానాల్లో విజయం సాధించింది. మరో స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతోంది.
8:04 PM, 11 Feb
ఆమ్ ఆద్మీ పార్టీ 54 స్థానాల్లో విజయాన్ని నమోదు చేసింది.
7:36 PM, 11 Feb
ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటి వరకు 36 స్థానాల్లో విజయం సాధించింది. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆప్ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది.
7:13 PM, 11 Feb
భార్య సునీత, భగవాన్ హనుమాన్‌కు అరవింద్ కేజ్రీవాల్ కృతజ్ఞతలు తెలిపారు. భగవాన్ హనుమాన్ వల్లే తాము సరైన మార్గంలో వెళ్లి విజయం సాధించామని అన్నారు.
6:59 PM, 11 Feb
అందరికి మంచి చేస్తారు..
హనుమంతుడు అందరికి మంచి చేస్తారు.. హనుమాన్ ఆలయ సందర్శన అనంతరం మీడియాతో కేజ్రీవాల్
6:40 PM, 11 Feb
కేజ్రీవాల్‌ను అభినందించిన ప్రధాని మోదీ
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ని అభినందించిన ప్రధాని నరేంద్రమోడీ. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ, అరవింద్ కేజ్రీవాల్‌కు కంగ్రాట్స్. ఢిల్లీ ప్రజలు ఆకాంక్షలను సంపూర్ణంగా నెరవేరుస్తారని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్.. అంటూ మోడీ ట్వీట్ చేశారు.
READ MORE

English summary
Delhi Election Results 2020: Delhi assembly votes are counting in tuesday morning 8 am at 21 centers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X