వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోదీ విషెస్‌కి కేజ్రీవాల్ ఏం రిప్లై ఇచ్చారో తెలుసా.. ఇదిగో ఇలా..

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ విజయంపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని కోరుతున్నట్టు చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా మోదీ స్పందించగా... అరవింద్ కేజ్రీవాల్ మోదీకి బదులిచ్చారు. ధన్యవాదాలు సార్ అంటూ బదులిచ్చిన కేజ్రీవాల్... ఢిల్లీని అసలైన ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు కేంద్రం సహకారం కోవాలని కోరారు.

కాగా,ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 62 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. బీజేపీ కేవలం 8 స్థానాలకు పరిమితం కాగా.. కాంగ్రెస్ అసలు ఖాతానే తెరవలేదు.
ఎన్నికల ఫలితాల అనంతరం ఆమ్ ఆద్మీ ప్రధాన కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకుంటున్న కార్యకర్తలు,మద్దతుదారులను ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ సందర్భంగా హనుమంతుడికి కృతజ్ఞతలు తెలిపారు. భారత్ మాతాకీ జై,ఇంక్విలాబ్ జిందాబాద్,వందేమాతరం అంటూ గట్టిగా నినాదాలు చేశారు. ఢిల్లీ ప్రజల ఆశీర్వాదంతో ఎన్నికల్లో మళ్లీ గెలిచామన్నారు. ఇది ఢిల్లీ ప్రజలను హనుమంతుడు ఆశీర్వదించిన రోజు అని కేజ్రీవాల్ అభిప్రాయపడ్డారు. భగవాన్ హనుమాన్ తమకు ఇలాగే సరైన మార్గ నిర్దేశం చేయాలని ప్రార్థిస్తున్నామని.. తద్వారా మరో ఐదేళ్లు ప్రజలకు సేవ చేస్తామని చెప్పారు.

Recommended Video

Good Morning India: 3 Minutes 10 Headlines : YS Jagan To Meet Modi, Amit Shah
delhi election results arvind kejriwals reply to modi wishes

ఢిల్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఓ టీవీ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూ సందర్భంగా తాను హనుమాన్ భక్తుడినని కేజ్రీవాల్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా హనుమాన్ చాలీసా కూడా చదివి వినిపించారు. అయితే దానిపై బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించాయి. కేజ్రీవాల్ ఉగ్రవాది అని, షాహీన్‌బాగ్‌లో బిర్యానీలు పంచుతున్నారని రకరకాల ప్రచారం చేశారు. చివరకు ఢిల్లీ ప్రజలు మాత్రం బీజేపీని పక్కనపెట్టి కేజ్రీవాల్‌కే జైకొట్టారు.

English summary
delhi election results arvind kejriwals reply to modi wishes
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X