వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

Recommended Video

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన ఢిల్లీ మాజీ సీఎం షీలా దీక్షిత్ || Oneindia Telugu

ఢిల్లీ: రాజకీయ కురవృద్ధురాలు సీనియర్ కాంగ్రెస్ మహిళా నేత ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ న్యూఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. ఆమె వయస్సు 81 సంవత్సరాలు. గత కొంత కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు.శనివారం ఉదయం పరిస్థితి కాస్త సీరియస్‌గా మారడంతో ఆమెను 10:30 గంటలకు ఢిల్లీలోని ఓ హాస్పిటల్‌లో అడ్మిట్ చేశారు. చికిత్స పొందుతూ మధ్యాహ్నం 3.30 గంటలకు షీలా దీక్షిత్ మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

Delhi Ex CM Sheila Dikshit Passes away at 81

ఢిల్లీ రాజకీయాల్లో షీలా దీక్షిత్ ప్రముఖ పాత్ర పోషించారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆమె 15 ఏళ్లు సేవలందించారు. ఇక షీలా దీక్షిత్ మృతి యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియాగాంధీకి వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పొచ్చు. షీలా దీక్షిత్‌తో సోనియాగాంధీకి మంచి స్నేహం ఉంది. రాజకీయా వ్యూహాలు ఇద్దరు కలిసి రచించేవారు. ఇదిలా ఉంటే షీలా దీక్షిత్ మృతికి కాంగ్రెస్ సంతాపం తెలిపింది. ఈ మేరకు ట్విటర్‌లో పోస్టు చేసింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా 15 ఏళ్లు సేవలందించిన షీలా దీక్షిత్... ఢిల్లీ రూపురేఖలనే మార్చారని కాంగ్రెస్ కొనియాడింది. షీలా దీక్షిత్ కుటుంబ సభ్యులకు మిత్రులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు కాంగ్రెస్ ట్విటర్‌లో పేర్కొంది

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి వార్త తనను కలచివేసిందని ఆమె కుటంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. ఢిల్లీ అభివృద్ధికి ఆమె ఎనలేని కృషి చేశారని మోడీ కొనియాడారు. ఓం శాంతి అంటూ తన ట్వీట్‌ను ముగించారు.ఇదిలా ఉంటే షీలా దీక్షిత్‌ మృతికి సోషల్ మీడియాలో ఆమె అభిమానులు ఇతర రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.

English summary
Three-time Delhi Chief Minister and senior Congress leader Sheila Dikshit died on Saturday in New Delhi. She was 81. Shiela Dikshit had been ill for a long time. She was admitted at around 10.30 am today. She died at 3.30 pm at a city hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X