వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi Exit Poll Result 2020: ఏబీపీ-సీఓటర్ కూడా కేజ్రీవాల్‌కే పట్టం, వెనకే బీజేపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికలు శనివారం సాయంత్రం ముగియడంతో పలు మీడియా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేస్తున్నాయి. గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో ఓటర్లు ఓటు వేసేందుకు అంతగా ఆసక్తి చూపనట్లుగానే తెలుస్తోంది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 67.5శాతం ఓటింగ్ నమోదవగా.. తాజాగా జరిగిన ఎన్నికల్లో కేవలం 54.6శాతమే కావడం గమనార్హం.

ఢిల్లీ ఎన్నికలను ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బాగానే శ్రమించింది. అయినప్పటికీ ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. ఢిల్లీ ఓటర్లు ఆమ్ ఆద్మీ పార్టీకి మరోసారి పట్టం కట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇక మీడియా సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ గమనించినట్లయితే.. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి, బీజేపీకి మధ్య ప్రధానంగా గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ కూడా ఆమ్ ఆద్మీ పార్టీదే అధికారమని స్పష్టం చేసింది.

 Delhi Exit Poll Result 2020: ABP-CVoter predicts AAP will Return to Power

మొత్తం 70 స్థానాల్లో ఏబీపీ-సీ ఓటర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం..

ఆమ్ ఆద్మీ పార్టీ: 49-63
భారతీయ జనతా పార్టీ: 05-19
కాంగ్రెస్: 00-04
ఇతరులు: 00

రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం...

రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాల ప్రకారం ఢిల్లీలో మళ్లీ ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారం చేపడుతుందని స్పష్టం చేసింది.

మొత్తం 70 సీట్లు: రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు:

ఆమ్ ఆద్మీ పార్టీ: 48-61
బీజీపీ: 9-21
కాంగ్రెస్: 1
ఇతరులు: 0

దాదాపు ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఆమ్ ఆద్మీ పార్టీదే మళ్లీ అధికారమని స్పస్టం చేశాయి. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది. కాంగ్రెస్ మాత్రం ఘోరంగా విఫలమైంది. గతంలో వచ్చిన సీట్లు కూడా రాకపోవడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉండటంతో ఆప్ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ నేతలు మాత్రం నిరాశలో కూరుకుపోయారు. కాగా, ఫిబ్రవరి 11న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.

English summary
Delhi Exit Poll Result 2020: Delhi Exit Poll Result 2020: ABP-CVoter predicts AAP will Return to Power.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X