వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో కరోనా థర్డ్ వేవ్ .. కరోనా కేసుల తీవ్రతపై సీఎం కేజ్రీవాల్ వ్యాఖ్యలు

|
Google Oneindia TeluguNews

దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్చి నుండి మే వరకు కరోనా వైరస్ కేసులు పెరుగుతూ వచ్చినా, జూన్ నుండి కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే మళ్లీ గత కొన్ని రోజులుగా ఢిల్లీలో విపరీతంగా కేసులు పెరుగుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కేసుల వ్యాప్తిలో దీనిని థర్డ్ వేవ్ గా చెప్పవచ్చని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పేర్కొన్నారు.

వచ్చే మూడు నెలలు మహా డేంజర్ ... కరోనా కష్టకాలం .. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ హెచ్చరికవచ్చే మూడు నెలలు మహా డేంజర్ ... కరోనా కష్టకాలం .. తెలంగాణా హెల్త్ డైరెక్టర్ హెచ్చరిక

 పండుగ సీజన్లో నగరంలో టపాసుల వాడకంపై త్వరలో నిర్ణయం

పండుగ సీజన్లో నగరంలో టపాసుల వాడకంపై త్వరలో నిర్ణయం

కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైందని ప్రజలు కూడా కరోనా నిబంధనలు పాటించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
అధికార యంత్రాంగంపరిస్థితినిఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది అని, ఢిల్లీలో కేసుల సంఖ్యను పెరగకుండా చూసేందుకుఅన్ని చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తెలిపారు. పండుగ సీజన్లో నగరంలో టపాసుల వాడకంపై త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నామని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చెప్పారు.

ప్రైవేటు ఆసుపత్రులలో 80% ఐసియు పడకల విషయంలో సుప్రీం కు వెళ్తాం

ప్రైవేటు ఆసుపత్రులలో 80% ఐసియు పడకల విషయంలో సుప్రీం కు వెళ్తాం

అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులలో బెడ్ ల కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశించామని చెప్పారు . ప్రైవేటు ఆసుపత్రులలో 80% ఐసియు పడకలను (కోవిడ్ -19 రోగులకు) రిజర్వ్ చేయాలన్న ఢిల్లీ ప్రభుత్వ ఆదేశం పై హైకోర్టు స్టే విధించింది అని అని కేజ్రీవాల్ చెప్పారు. దీనిపై తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. అసలే శీతాకాలం, అందులోనూ పండుగ సీజన్ కావడంతో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. పండుగ సీజన్లో సాధారణంగా విపరీతంగా టపాసులు కాల్చడంపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

ఒకరోజులోనే 6,725 మందికి పాజిటివ్ .. భారీగా పెరుగుతున్న కేసులు

ఒకరోజులోనే 6,725 మందికి పాజిటివ్ .. భారీగా పెరుగుతున్న కేసులు


ఢిల్లీలో తాజాగా మంగళవారం రోజు 59,540 కరోనా పరీక్షలను చేశారు. ఒక రోజున 6,725 మందికి పాజిటివ్ రావడంతో మంగళవారం కోవిడ్-19 కేసులలో అత్యధిక సింగిల్-డే జంప్‌ను ఢిల్లీ చూసింది. పాజిటివిటీ రేటు 11.29% వద్ద ఉంది. గత కొన్ని రోజులుగా నగరంలో కొత్త కేసుల సంఖ్య క్రమంగా పెరిగింది, ఇప్పటి వరకు మొత్తం 6,600 ఢిల్లీలో మరణాలు నమోదయ్యాయి. ఇక భారతదేశంలో ఇప్పటివరకు 8.3 మిలియన్ల కేసులు నమోదు కాగా, 1.24 లక్షల మరణాలు సంభవించాయి.

English summary
Delhi Chief Minister Arvind Kejriwal today said a third wave of coronavirus is now sweeping through the city and the government is preparing for all contingencies. There would soon also be a decision on the use of firecrackers in the city during the festival season, he said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X