వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ గ్యాంగ్ రేప్: ఆశా మిర్జే వివాదాస్పద వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Asha Mirje
న్యూఢిల్లీ‌‌: వైద్య విద్యార్థినిపై ఢిల్లీలోని బస్సులో జరిగిన సామూహిక అత్యాచారంపై దేశయావత్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే ఎన్సీపి మహిళా నేత ఆశా మిర్జే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కారు. ఈ సంఘటనలో బాధితురులిదే తప్పని ఆమె వ్యాఖ్యానించారు.

ఆమె రాత్రి 11 గంటలకు సినిమా ఎందుకు చూడాలని ఆశా మిర్జే అడిగారు. బాధితురాలి వస్త్రధారణను, ప్రవర్తనను కూడా ఆమె తప్పు పట్టారు. నాగపూర్‌లో జరిగిన పార్టీ మహిళా విభాగం సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ సంఘటన విషయంలోనే కాదు, శక్తిమిల్స్ సంఘటన విషయంలోనూ ఆశా మిర్జా బాధితురాలిని తప్పు పట్టారు.

సాయంత్రం ఆరు గంటల వేళ నిర్మానుష్యమైన శక్తి మిల్స్ ఆవరణలోకి బాధితురాలు ఎందుకు వెళ్లాలని ఆమె అడిగారు. మహారాష్ట్ర రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలైన ఆశా మీర్జే వ్యాఖ్యలను ఐద్వా తప్పు పట్టింది. ఆ పదవికి ఆశా మిర్జే తగరని వ్యాఖ్యానించింది.

2012 డిసెంబర్ 16వ తేదీన వైద్య విద్యార్థిని తన స్నేహితుడితో కలిసి సినిమా చూసిన తర్వాత బస్సు ఎక్కింది. రాం సింగ్, వినయ్, అక్షయ్, పవన్, ముకేష్ అనే వ్యక్తులతో పాటు ఓ మైనర్ ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఆ విద్యార్థిని 2012 డిసెంబర్ 29వ తేదీన మరణించింది.

English summary

 Notwithstanding the national outrage over the Delhi gangrape on a moving bus and the subsequent death penalty to the accused, NCP woman leader Asha Mirje has stoked a controversy by putting the blame on the rape victim.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X