వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

coronavirus: డాక్టర్‌కు కరోనా, సర్కార్ దవాఖాన క్లోజ్, మరో ఇద్దరు వైద్యులకు కూడా..

|
Google Oneindia TeluguNews

ఎలా వస్తుందో తెలియడం లేదు గానీ.. కరోనా పాజిటివ్ కేసులు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. ఢిల్లీ క్యాన్సర్ ఆస్పత్రి వైద్యురాలికి కూడా వైరస్ సోకింది. ఆస్పత్రిలో ఎవరికీ వైరస్ లేకపోగా.. ఇంట్లోనే వైరస్ సోకిందని అధికారులు తెలిపారు. కానీ ఆమె ఇంట్లో కాకుండా ఇటీవల తన సోదరుడి ఇంటికి వెళ్లడంతో సోకిందన్నారు.

ఇటీవల వైద్యురాలి సోదరుడి లండన్ నుంచి వచ్చాడు. అతనిని కలిసేందుకు ఇంటికెళ్లింది. తర్వాత ఆమెకు కరోనా పాజిటివ్ సోకిందని నిర్ధారించారు. ఆమె ఆస్పత్రికి వెళ్లడంతో.. అక్కడ ఆమె తాకిన వస్తువులతో వైరస్ ప్రబలే అవకాశం ఉంది. దీంతో ఆస్పత్రి మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఆస్పత్రిని స్ప్రే చేస్తున్నామని ఢిల్లీ వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ పేర్కొన్నారు.

Delhi govt cancer hospital doctor tests coronavirus positive, building shut

మంగళవారం ఈశాన్య ఢిల్లీలో గల మొహల్లా క్లినిక్‌‌కు చెందిన వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చిందని అధికారులు చెప్తున్నారు. మౌజ్‌పూర్‌లో క్లినిక్ నిర్వహిస్తోన్న వైద్యుడు.. ఈ నెల 21వ తేదీన వైరస్ సోకింది. అతని క్లినిక్‌కు సౌదీ అరేబియా నుంచి రోగి వచ్చారు. అతనిని పరీక్షించే సమయంలో వైరస్ సోకింది. వైద్యుడికి సోకడంతో బాబర్‌పూర్‌లో క్లినిక్ నిర్వహిస్తోన్న అతని భార్య.. కూతురికి కూడా ఈ నెల 25వ తేదీన వైరస్ సోకింది.

వైద్యుల దంపతులతో కాంటాక్ట్ అయిన వారిని కనుక్కొనేందుకు సిటీ ఇంటిగ్రేటెడ్ టీం రంగంలోకి దిగింది. ఓ రోగిని ట్రాక్ చేస్తున్నారు. వైద్య దంపతులు కనీసం 3800 మంది కలిసి ఉంటారని అధికారులు భావిస్తున్నారు. సౌదీ అరేబియా నుంచి వచ్చిన ఒకరి వల్ల 10 మందికి వైరస్ సోకింది.

English summary
doctor at a Delhi government-run cancer hospital has tested positive for Covid-19, the coronavirus disease, prompting officials to close it down on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X