వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మందుబాబులకు కిక్కు ఎక్కించే న్యూస్: 70 శాతం స్పెషల్ ఫీజు తొలగింపు: ఎప్పటి నుంచి అంటే..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మందుబాబులకు ఇది నిజంగా శుభవార్తే. మద్యాన్ని కొనలేకపోతోన్న లిక్కర్ ప్రియులకు మాంఛి కిక్కు ఎక్కించే వార్త ఇది. ఇందులో డౌట్స్ అనవసరం. మద్యం అమ్మకాల బాదుడు బాధ నుంచి మందుబాబులకు ఊరట కలిగించడం ఖాయం. మద్యం అమ్మకాలపై విధించిన కరోనాా స్పెషల్ ఫీజును ఎత్తేయబోతోంది ఢిల్లీ ప్రభుత్వం. ఈ మేరకు ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలు ఈ నెల 10వ తేదీ నుంచి అమల్లోకి రాబోతున్నాయి. వైరస్ వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని విధించిన 70 శాతం ప్రత్యేక కరోనా ఫీజును ఉపసంహరించుకున్నట్లు పేర్కొంది.

చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!చివరి అంకానికి నిమ్మగడ్డ వ్యవహారం: మరో మూడు రోజుల్లో: సుప్రీంలో: చీఫ్ జస్టిస్ సారథ్యంలో!

కరోనా స్పెషల్ ఫీజు రద్దు..

కరోనా స్పెషల్ ఫీజు రద్దు..

ఈ నెల 10వ తేదీ నుంచి సాధారణ రేట్లతోనే మద్యం అమ్మకాలను కొనసాగించడానికి అనుమతి ఇచ్చింది. ఇప్పటిదాకా మద్యం అమ్మకాలపై 70 శాతం కరోనా ప్రత్యేక ఫీజును వసూలు చేస్తూ వచ్చింది కేజ్రీవాల్ సర్కార్. ఇప్పుడా ఫీజును రద్దు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వెల్లడించారు. ఆదివారం ఉదయం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పలు కీలక అంశాలను తెలిపారు. మద్యం అమ్మకాలపై అమలు చేసిన ప్రత్యేక కరోనా ఫీజును ఎత్తేస్తున్నామని అన్నారు. కిందటి నెల 5వ తేదీన మద్యం అమ్మకాలపై ఢిల్లీ ప్రభుత్వం కరోనా ఫీజును విధించిన విషయం తెలిసిందే.

ఢిల్లీ సరిహద్దులు ఇక ఓపెన్..

ఢిల్లీ సరిహద్దులు ఇక ఓపెన్..

దేశ రాజధాని సరిహద్దులన్నింటినీ ఇక తెరవబోతున్నామని కేజ్రీవాల్ తెలిపారు. పొరుగు రాష్ట్రాల నుంచి న్యూఢిల్లీలోకి ప్రవేశించడానికి అందుబాటులో ఉన్న మార్గాలన్నీ సోమవారం నుంచి తెరుస్తామని అన్నారు. షాపింగ్ మాల్స్, అన్ని ప్రార్థనా మందిరాలు, రెస్టారెంట్లను అందుబాటులోకి తీసుకుని వస్తామని చెప్పారు. హోటళ్లు, సమావేశాలను ఏర్పాటు చేసుకోవడానికి నిర్మించిన బంకెట్ హాళ్లను తెరవడానికి అనుమతి లేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. వాటిని తెరవడానికి మరి కొంత సమయం పడుతుందని అన్నారు.

ఢిల్లీలోని ఆసుపత్రులు స్థానికులకు మాత్రమే..

ఢిల్లీలోని ఆసుపత్రులు స్థానికులకు మాత్రమే..

ఢిల్లీ ప్రభుత్వ పరిధిలో ప్రస్తుతం ఉన్న ఆసుపత్రుల్లో స్థానికులకు మాత్రమే చికిత్స అందించేలా ఏర్పాట్లను చేశామని అన్నారు. ఢిల్లీలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని, దాని తీవ్రత, పాజిటివ్ కేసుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. జాతీయ వైద్య విజ్ఙాన సంస్థ (ఎయిమ్స్) వంటి జాతీయ ఆసుపత్రుల్లో ఎవ్వరైనా.. ఏ రాష్ట్రానికి చెందిన వారైనా వైద్యం చేయించుకోవచ్చని అన్నారు.

Recommended Video

Cyclone Gati: Another Low Depression in Bay Of Bengal
1500 పడకలు అవసరం..

1500 పడకలు అవసరం..

జూన్ నెలాఖరులోగా ఢిల్లీలో 15000 వైద్య పడకలు అవసరం అవుతాయని అన్నారు. అందువల్లే స్థానికులకు మాత్రమే వైద్యం అందేలా ఏర్పాట్లు చేశామని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఆసుపత్రులను మరింత బలోపేతం చేయబోతున్నామని అన్నారు. అవసరమైన చోట్ల వాటి సామర్థ్యాన్ని, పడకల సంఖ్యను పెంచుతామని చెప్పారు. వయోధిక వృద్ధులు, చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా.. వయోధిక వృద్ధలు తరచూ చిన్నపిల్లలను అక్కున చేర్చుకోవడాన్ని నివారించాలని కేజ్రీవాల్ సూచించారు.

English summary
New Delhi: The Delhi government has decided to withdraw the 70 percent 'special corona fee' levied on the maximum retail price on all categories of liquor, with effect from June 10. The Arvind Kejriwal-led AAP government had imposed a 'special corona fee' of 70 percent on MRP on all categories of liquor sold through retail licensees for consumption ‘off the premises’ on May 5 amid coronavirus lockdown.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X