వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాక్‌డౌన్ 4.0: తెరమీదికి ఢిల్లీ ఫార్ములా? కేంద్రం ఏం చెబుతోంది? మాల్స్ రీఓపెన్‌కు ఛాన్స్?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి దేశవ్యాప్తంగా అమలు చేస్తోన్న 14 రోజుల నాలుగో దశ లాక్‌డౌన్ మరో రెండు రోజుల్లో ముగియబోతోంది. సోమవారం నుంచి నాలుగో విడత లాక్‌డౌన్ అమల్లోకి వస్తుందంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇదివరకే స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రేపో, మాపో విడుదల కాబోతున్నాయి. ఈ మార్గదర్శకాల్లో అనేక సడలింపులు ఉండొచ్చంటూ అభిప్రాయాలు వినిపిస్తోన్న వేళ.. సరి బేసి విధానాన్ని తెరమీదికి తీసుకుని వచ్చే అవకాశాలను కేంద్రం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంగ్లీష్ మీడియం: వెనక్కి తగ్గని సుధీష్ రాంభొట్ల: ఈ సారి సుప్రీంకోర్టుకు: కొత్త జీవోపైనా రగడఇంగ్లీష్ మీడియం: వెనక్కి తగ్గని సుధీష్ రాంభొట్ల: ఈ సారి సుప్రీంకోర్టుకు: కొత్త జీవోపైనా రగడ

ఇదవరకు సరిబేసి విధానాన్ని ఢిల్లీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. వాహన కాలుష్యాన్ని నివారించడంలో భాగంగా సరిబేసి నంబర్లు ఉన్న వాహనాలు మాత్రమే రోజు మార్చి రోజు రోడ్ల మీదికి రావడానికి అనుమతి ఇచ్చింది. ఇది ఆశించిన ఫలితాలను ఇచ్చింది. ఇదే విధానాన్ని నాలుగో దశ లాక్‌డౌన్‌ సందర్భంగా అమలు చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలను పంపించినట్లు చెబుతున్నారు. దీనిపై కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 Delhi govt request Centre to reopen of Markets, Malls on Odd-Even Basis

ఇదే విధానాన్ని మిగిలిన రాష్ట్రాల్లోనూ అమలు చేస్తే ఎలా ఉంటుందనే దిశగా కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని అంటున్నారు. సరి బేసి తేదీల్లో షాపింగ్ మాల్స్, మార్కెట్లను తెరవడానికి అనుమతి ఇస్తే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయనే అంశంపై అధ్యయనం చేస్తోందని సమాచారం. దీనిపై ఢిల్లీ ప్రభుత్వం నుంచి మరిన్ని వివరాలను సేకరిస్తోందని అంటున్నారు. సరి బేసి తేదీల్లో షాపింగ్ మాల్స్‌ను తెరవడం, ప్రజా రవాణాను పునరుద్ధరించడం పట్ల మంచి ఫలితాలు వస్తాయని ఢిల్లీ ప్రభుత్వం కేంద్రానికి సూచించినట్లు చెబుతున్నారు.

Recommended Video

Nirmala Sitharaman Announces Free Ration To All Migrants For Next Two Months

ఈ విధానాన్ని అమలు చేయడం వల్ల షాపింగ్ మాల్స్‌పై పర్యవేక్షణ, వాటి కార్యకలాపాలపై నిఘా ఉంచడానికి వీలు ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. అదే జరిగితే- దీనికి సంబంధించిన సూచనలను కేంద్ర ప్రభుత్వం తన మార్గదర్శకాల్లో చేర్చే అవకాశాలు లేకపోలేదు. భవన నిర్మాణ రంగ పనులు, ఇద్దరికి మాత్రమే వీలు కల్పించేలా ట్యాక్సీలు, ఆటోలను నడిపించడానికి అనుమతి ఇవ్వడం.. సహా అన్నింటినీ సరిబేసి విధానంలో పునరుద్ధరించడానికి ఈ విదానం ఉపయోగపడుతుందని ఢిల్లీ ప్రభుత్వం చెబుతోంది. దీని ప్రకారం.. జనజీవనాన్ని పాక్షికంగానైనా పునరుద్ధరించినట్టవుతుందని ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదనలను పంపించింది.

English summary
The Delhi government on Thursday submitted a proposal to the Centre on lockdown relaxations post-May 17 and suggested the opening of markets, shopping complexes and operation of buses and metro services with strict social distancing norms as Odd-Even Basis. The government has suggested operation of construction activities in the national capital and that movement of labourers within Delhi be allowed. Taxis with two passengers will be allowed, they said, adding that in buses, 20 passengers are likely to be allowed to travel under strict social distancing norms.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X