వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేజ్రీవాల్ క్యాబినెట్‌లో నో ఉమెన్, మహిళలకు అవకాశం ఇవ్వని కుమారుడు, సాధికారత అంటూ..

|
Google Oneindia TeluguNews

మహిళా సాధికారిత, మహిళల హక్కుల గురించి మాట్లాడే ఆప్.. మంత్రివర్గంలో మాత్రం వారికి చోటు కల్పించలేదు. సీఎం కేజ్రీవాల్ సహా మిగతావారిలో ఒక్క మహిళకు కూడా అవకాశం ఇవ్వలేదు. ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎనిమిది మంది మహిళా సభ్యులు ఆప్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తోండం విశేషం. 2013లో రాఖీ బిర్లాకు ఛాన్స్ ఇచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఈసారి ఎవరికీ అవకాశం ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది.

నాలుగు సార్లు..

నాలుగు సార్లు..


2020లో చోటు కల్పించలేదు కానీ.. ఇదివరకు మహిళలకు ప్రాతినిధ్యం కల్పించిన దాఖలాలు ఉన్నాయి. 1993లో ఢిల్లీ అసెంబ్లీ ఏర్పడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి ఇప్పటివరకు కేవలం నాలుగుసార్లు మాత్రమే మహిళలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. తమిళనాడులో జయలలిత, ఉత్తరప్రదేశ్‌లో మాయావతి తర్వాత ఢిల్లీలో షీలా దీక్షిత్ ముఖ్యమంత్రులుగా పనిచేశారు. అయితే వారి మంత్రివర్గాల్లో మహిళలకు ఆశించిన మేర చోటు దక్కకపోవడంతో మహిళా సాధికారత అంటే ఇదేనా అనే అనుమానం తలెత్తుతోంది.

 వీరే మహిళా మంత్రులు..

వీరే మహిళా మంత్రులు..

1998లో బీజేపీ పుర్ణిమ సేథి, 1998-2001 వరకు కాంగ్రెస్ నుంచి కృష్ణ తిరాత్, 2008-2013 వరకు కిరణ్ వాలా, 2013 నుంచి 2014 వరకు ఆప్‌కు చెందిన రాఖీ బిర్లా మాత్రమే ఢిల్లీ మంత్రులుగా పనిచేశారు. వీరిలో కిరణ్ వాలా ఒక్కరే పూర్తిగా పదవీకాలం కొనసాగారు. మిగతా వారంతా కొద్దిరోజులే మంత్రులుగా బాధ్యతలు నిర్వర్తించారు. వీరిలో కాంగ్రెస్ పార్టీ ఇద్దరు మహిళలకు మంత్రులుగా అవకాశం కల్పించింది. అంతేకాదు ఆ పార్టీ నుంచే షీలా దీక్షిత్ మూడుసార్లు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. ఆదివారం మూడోసారి సీఎంగా పనిచేసి షీలా దీక్షిత్ రికార్డ్‌ను అరవింద్ కేజ్రీవాల్ సమం చేశారు.

49 రోజులు..

49 రోజులు..

ఢిల్లీ అసెంబ్లీకి ఇప్పటివరకు ఏడుసార్లు ఎన్నికలు జరగగా.. మహిళలకు మాత్రం మంత్రివర్గంలో ఆశించిన మేర స్థానం కలుగడం లేదు. మహిళా సాధికారత, హక్కుల పేరుతో మాట్లాడే ఆప్ నేతలు.. ఈసారి మంత్రివర్గంలో అవకాశం కల్పించలేదు. సమాజంలో మహిళలకు ప్రాధాన్యం, భద్రత అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు మాత్రం ఇస్తారు. కేజ్రీవాల్ మొదటి టర్మ్ మంత్రివర్గంలో రాఖీ బిర్లాకు మాత్రం అవకాశం ఇచ్చారు. 49 రోజులు క్యాబినెట్‌లో కొనసాగారు.

చట్టసభకు కూడా..

చట్టసభకు కూడా..

ఢిల్లీ మంత్రివర్గంలోనే కాదు అసెంబ్లీకి పోటీ చేసి వారిలో కూడా మహిళ సంఖ్య తక్కువే. ఇప్పటివరకు 39 మంది మహిళలు మాత్రమే చట్టసభకు ఎన్నికయ్యారు. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే 20 మంది ఎమ్మెల్యేలు ఉండటం విశేషం. 1993, 1998 అసెంబ్లీ ఎన్నిల్లో బీజేపీ ఒక్కో మహిళ చట్టసభకు ఎన్నికయ్యారు. తర్వాత ఏ ఒక్క బీజేపీ మహిళా నేత చట్టసభకు ఎన్నికవలేదు. కాంగ్రెస్ నుంచి 20 మంది, ఆప్ నుంచి 17 మంది, బీజేపీ నుంచి కేవలం ఇద్దరు మహిళలు మాత్రమే ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేలుగానే కాదు ఎంపీలుగాను పరిస్థితి ఇంచుమించు అలాగే ఉంది.

English summary
Aam Aadmi Party has openly spoken about women’s empowerment, this time it has once again kept women away from the Cabinet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X