వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కునాల్ కామ్రా నిషేధంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం, విచారణ జరపకుండా ఎలా బ్యాన్ చేస్తారని డీజీసీఏకు ప్రశ్న

|
Google Oneindia TeluguNews

హాస్యనటుడు కునాల్ కామ్రాపై విమానయాన సంస్థల్లో నిషేధానికి సంబంధించిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం విచారించింది. విమానంలో కామ్రా ప్రవర్తనకు సంబంధించి విచారణ జరపకుండానే చర్యలు ఎలా తీసుకుంటారని డైరెక్టరేట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ)ను ప్రశ్నించింది. కామ్రాపై నిషేధం విధించే ముందు అతని అభ్యంతరాన్ని ఒకసారి విమానయాన సంస్థ పరిశీలించి ఉంటే బాగుంటుందని అభిప్రాయపడింది.

ఇదీ విషయం

ఇదీ విషయం

గతనెల 28వ తేదీన ముంబై నుంచి లక్నో వెళ్తున్న విమానంలో కునాల్ కామ్రాతోపాటు రిపబ్లిక్ టీవీ ఎడిటర్ అర్నాబ్ గోస్వామి కూడా ప్రయాణిస్తున్నారు. అయితే అర్నాబ్‌ను చూసి కుమాల్ కామ్రా టీవీ షోలో అలాగే ప్రవర్తించారు. దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరలైంది. దీనిపై పౌరవిమానయాన శాఖ స్పందించింది. అంతకుముందే ఇండిగో తమ విమానంలో ఆరు నెలల నిషేధం విధించిన సంగతి తెలిసిందే.

 చర్యలు ఎందుకంటే..

చర్యలు ఎందుకంటే..

విమానంలో అనుచితంగా ప్రవర్తించినందుకే నిషేధం విధించామని ఇండిగో సంస్థ పేర్కొన్నది. తర్వాత పౌరవిమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి సూచనతో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ కూడా నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అయితే తాను విమానంలో ప్రయాణించే సమయంలో టీవీ షోలలో ఎలా పాల్గొంటారని అడిగానని.. 20 సెకండ్ల తర్వాత తన సీటులో కూర్చొన్నానని గుర్తుచేశారు. తప్పుగా ప్రవర్తిస్తే క్షమించాలని విమాన సిబ్బందికి క్షమాపణలు కూడా చెప్పానని కామ్రా పేర్కొన్నారు.

మొర ఆలకించరు..

మొర ఆలకించరు..

వాదన వినకుండా నిషేధం విధించారని గత నెలలో ఇండిగో యాజమాన్యానికి నోటీసులు పంపించారు. తనకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని.. విమానాల్లో నిషేధం విధించినందుకు గానూ రూ.25 లక్షల పరిహారం అందజేయాలని పిటిషన్ వేశారు. అంతేకాదు తన క్లైయింట్ చేయని తప్పుకు శిక్షించినందుకు మానసికంగా వేదనకు గురయ్యాడని అడ్వకేట్ ప్రశాంత్ శివరాజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు.

తెరపైకి పైలట్..

తెరపైకి పైలట్..

మరోవైపు తనను సంప్రదించకుండా కునాల్ కామ్రా ఎలా బ్యాన్ విధిస్తారని సంస్థకు రాసిన లేఖలో అడిగారు. ఎయిర్‌లైన్స్ విధించిన సస్పెన్షన్ గురించి తెలిసి షాక్‌నకు గురయ్యానని పేర్కొన్నారు. విమానంలో ఏం జరిగిందనే అంశంపై యాజమాన్యం తనను ఆరాతీయలేదని గుర్తుచేశారు. కామ్రా సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఆధారంగా ఏకపక్షంగా చర్యలు తీసుకుందని చెప్పారు. వాస్తవానికి ఏదైనా ఘటన జరిగితే పైలట్ అభిప్రాయం తీసుకొని చర్యలు తీసుకుంటారు.. కానీ కునాల్ విషయంలో మేనేజ్‌మెంట్ మాత్రమే స్పందించింది. తొమ్మిదేళ్ల కెరీర్‌లో ఇలాంటి ఘటన చూడలేదని లేఖలో పేర్కొన్నారు.

English summary
Delhi High Court Tuesday pulled up the Directorate General of Civil Aviation (DGCA) for asking airline companies to impose a flying ban on comedian Kunal Kamra pending inquiry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X