వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కుమార్ విశ్వాస్‌కు చుక్కెదురు: డిసిడబ్ల్యూ సమన్లపై స్టేకు హైకోర్టు నిరాకరణ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కుమార్ విశ్వాస్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. ఢిల్లీ మహిళా కమిషన్.. కుమార్ విశ్వాస్‌కు జారీ చేసిన సమన్లపై స్టే విధించేందుకు హైకోర్టు శుక్రవారం నిరాకరించింది. స్టే విధించాలని కోరుతూ కుమార్ విశ్వాస్ వేసిన పిటిషన్‌ను కోర్టు శుక్రవారం తిరస్కరించింది.

హైకోర్టు తీర్పుతో కుమార్ విశ్వాస్ మహిళా కమిషన్ ముందు హాజరు కావాల్సి ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఓ మహిళా వాలంటీర్‌తో అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు మే 4న మహిళా కమిషన్.. కుమార్ విశ్వాస్‌కు సమన్లు జారీ చేసింది.

Delhi HC refuses to stay DCW summons on Kumar Vishwas

కాగా, మే 7న తమ ముందు హాజరు కావాలని సమన్లు జారీ చేసినా కుమార్ విశ్వాస్ హాజరుకాకపోవడంతో మహిళా కమిషన్ అధిపతి బర్ఖా శుక్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ మహిళలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

మహిళా కమిషన్ ఇచ్చిన సమన్లపై స్టే విధించాలని కోరుతూ కుమార్ విశ్వాస్ మే 7న హైకోర్టును ఆశ్రయించారు. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా, బహిరంగంగా తమ సంబంధాన్ని చెప్పకుండా కుమార్ విశ్వాస్‌ తన జీవితాన్ని నాశనం చేశాడని బాధితురాలు పేర్కొంది.

English summary
In a major setback to AAP leader Kumar Vishwas, the Delhi High Court on Friday, May 15, refused to stay the summons issued to him by the Delhi Commission for Women (DCW) in the case of an alleged affair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X