వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైద్య, ఆరోగ్య మంత్రికి కరోనా లక్షణాలు: హైఫీవర్, అమిత్‌షా భేటీ ముగిసిన కొన్ని గంటల్లోనే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్ మరింత విజ‌ృంభిస్తోంది. రోజురోజుకూ చెలరేగిపోతోంది. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తీసుకుంటోన్న చర్యలను తుత్తునీయలు చేస్తోంది. ఇప్పటికే వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. 41 వేల మందికి పైగా ఢిల్లీవాసులు కరోనా బారిన పడ్డారు. వేర్వేరు ఆషుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నెల గడిచే సరికి ఒక్క ఢిల్లీలోనే లక్షకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యే అవకాశాలు లేకపోలేదని కేజ్రీవాల్ ప్రభుత్వం అంచనా వేస్తోంది. దీనికి అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లను చేస్తోంది.

కరోనా వైరస్ తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే.. కేజ్రీవాల్ కేబినెట్‌ మంత్రికి సైతం సోకింది. వైద్య, ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా లక్షణాలతో మంగళవారం తెల్లవారు జామున ఆయన ఢిల్లీ దిల్షద్ గార్డెన్, తహార్‌పూర్ ప్రాంతంలోని రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేరారు. గురువారం అర్ధరాత్రి సత్యేంద్ర జైన్‌ ఉన్నట్టుడి హైఫీవర్‌కు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. ఆక్సిజన్ స్థాయి క్షిణించింది. వెంటనే ఆయనను రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అత్యవసరంగా ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

 Delhi health minister Satyendar Jain was admitted to the hospital due to high fever

ఆసుపత్రిలో చేరిన వెంటనే ఆయనకు కోవిడ్ పరీక్షలను నిర్వహించారు. దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇంకా అందాల్సి ఉంది. కరోనా లక్షణాలు ఉన్నట్లు ప్రాథమికంగా డాక్టర్లు నిర్ధారించారు. ఢిల్లీలో కరోనా వైరస్ స్థితిగతులను సమీక్షించడానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ నిర్వహించిన సంయుక్త సమావేశంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో కలిసి సత్యేంద్ర జైన్ పాల్గొన్నారు. తొలిరోజు ఢిల్లీ ప్రభుత్వంతో.. మరుసటి రోజు ఢిల్లీ అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించారు అమిత్ షా. అఖిలపక్ష భేటీ ముగిసిన రోజు రాత్రే సత్యేంద్ర జైన్ హైఫీవర్‌కు గురయ్యారు.

Recommended Video

LOCKDOWN Extension: 16, 17 వ తేదీల్లో CM లతో PM Modi మరోసారి భేటీ ! UNLOCK 1 తెచ్చిన తిప్పలు...

సత్యేంద్ర జైన్ ఆసుపత్రిలో చేరడం పట్ల అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కొద్దిరోజులుగా ఆయన విశ్రాంతి లేకుండా గడుపుతున్నారని చెప్పారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడం ఆరంభమైనప్పటి నుంచీ ఆయన తరచూ అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహిస్తూ తీరిక లేకుండా గడుపుతున్నారని అన్నారు. 24 గంటల పాటు విశ్రాంతి లేకుండా పని చేస్తున్నారని అన్నారు. ఇక విశ్రాంతి తీసుకోవాలని సత్యేంద్ర జైన్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

English summary
New Delhi: Delhi Health Minister Satyendar Jain was admitted to the national capital's Rajiv Gandhi Super Specialty Hospital last night due to high fever and breathing trouble, a day after he attended a meeting where Union Home Minister Amit Shah and Chief Minister Arvind Kejriwal were present. He will be tested for coronavirus today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X