వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ వెబ్‌సైట్లకు ఢిల్లీ హైకోర్టు షాక్... సినిమా అప్‌లోడ్ చేశారో ఇక కటకటాలే..!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కొన్ని వందల కోట్లు పెట్టి ఓ సినిమాను తీస్తుంటే.. అప్పనంగా వాటిని ఆన్‌లైన్‌లో పెట్టేసి డబ్బులు సంపాదిస్తున్న పలు వెబ్‌సైట్లపై ఢిల్లీ హైకోర్టు కన్నెర్ర చేసింది. వెంటనే ఆ వెబ్‌సైట్లను బ్లాక్ చేయాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీసెస్ ప్రొవైడర్లకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఇక ఇలా ఆన్‌లైన్‌లో సినిమాలను ఉంచుతున్న సైట్లలో తమిళ్ రాకర్స్, ఈజెడ్‌టీవీ, క్యాట్ మూవీస్, లైమ్‌టొరెంట్జ్‌లాంటి వెబ్‌సైట్లున్నాయి. కేవలం సినిమాలే కాకుండా ప్రముఖ నిర్మాణ సంస్థలైన వార్నర్ బ్రదర్స్, యూనివర్శల్, నెట్‌ఫ్లిక్స్‌లాంటి టెలికాస్ట్ చేస్తున్న టీవీ సిరీస్‌లను సైతం తమ సైట్లలోకి అప్పనంగా అప్‌లోడ్ చేస్తున్నాయి.

కేసును విచారణ చేసిన జస్టిస్ సంజీవ్ నారులా ఈ వెబ్‌సైట్లకు సంబంధించిన యూఆర్‌ఎల్, ఐపీ అడ్రస్సులను బ్లాక్ చేయాల్సిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అంతేకాదు టెలికమ్యూనికేషన్స్ శాఖ, ఐటీ శాఖలకు కూడా ఢిల్లీ హైకోర్టు పలు సూచనలు చేసింది. ఇలా అక్రమంగా సినిమాలను తమ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న సైట్లను గుర్తించి వెంటనే వాటి రిజిస్ట్రేషన్లను రద్దు చేయాలని సూచించింది.

Delhi High court asks to block websites that host others content

అమెరికాకు చెందిన ఎంటర్‌టెయిన్మెంట్ కంపెనీ వార్నర్ బ్రదర్స్ కోర్టులో పిటిషన్ వేసింది. తమ ఒరిజినల్ కంటెంట్‌ను తమ వెబ్‌సైట్లో అప్‌లోడ్ చేసి స్ట్రీమింగ్ చేస్తున్నారంటూ పిటిషన్‌లో పేర్కొంది. ఇలా ఒరిజినల్ కంటెంట్‌ను తమదొక్కరిదే కాదని ఇతర నిర్మాణ సంస్థలైన యూటీవీ, స్టార్, పారామౌంట్, యూనివర్శల్, నెట్‌ఫ్లిక్స్ లాంటి సంస్థలు కూడా వీరి బారిన పడుతున్నాయని పిటిషన్‌లో పేర్కొంది. ఇక ఒకరికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్‌ను ప్రసారం చేసినా, తమ వెబ్‌సైట్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసినా, ఏపరంగా అయినా బయటకు వదిలినా కాపీరైట్ కింద చర్యలు తీసుకుంటామని వెబ్‌సైట్లను కోర్టు హెచ్చరించింది. ప్రస్తుతానికి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశామని లేదంటే నిర్మాణ సంస్థలకు తీరని నష్టం వాటిల్లుతుందని కోర్టు వార్నర్ బ్రదర్స్‌ సంస్థకు తెలిపింది.

English summary
The Delhi High Court has directed Internet service providers (ISPs) to block access to websites like Tamilrockers, eztv, katmovies and limetorrents which are allegedly engaged in unauthorised streaming and distribution of movies and television series of production houses like Warner Bros, Universal and Netflix.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X