వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ పుష్పకు భద్రత కల్పించలేం: ఎప్పుడంటే అప్పుడు ఇంటి నుంచి వెళ్లిపోతారు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుప్ఫ పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది. తనకు సెక్యూరిటీ కల్పించాలని పోలీసు అధికారులకు సూచించాలని శశికళ పుష్ప పెట్టుకున్న పిటిషన్ ను ఢిల్లీ కోర్టు కొట్టి వెయ్యడంతో ఆమె షాక్ కు గురైనారు.

<strong>రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాను: ఒక్క రూపాయి రాలేదు: పన్నీర్ అసహనం, ఎందుకంటే!</strong>రూ. 100 కోట్లు ఖర్చుపెట్టాను: ఒక్క రూపాయి రాలేదు: పన్నీర్ అసహనం, ఎందుకంటే!

మేము చెప్పిన మాటలు లెక్కచెయ్యకుండా ఎంపీ శశికళ పుష్ప ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారని, ఆమె మా మాటలకు విలువ ఇవ్వడం లేదని, ఇలాంటి వారికి సెక్యూరిటీ ఇవ్వలేమని ఢిల్లీ పోలీసులు చేతులు ఎత్తి వెయ్యడంతో ఢిల్లీ హైకోర్టు శశికళ పుష్ప అభ్యర్థనను తోసిపుచ్చింది.

నాకు ప్రాణహాని ఉంది

నాకు ప్రాణహాని ఉంది

రాజ్యసభ సభ్యురాలైన తనకు ప్రాణహాని ఉందని, నా కుటుంబ సభ్యులకు నిత్యం ప్రాణాలు తీస్తామని బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని శశికళ పుప్ప ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తనతో పాటు తన కుటుంబ సభ్యులకు మరింత భద్రత కల్పించాలని కోర్టులో మనవి చేశారు.

కారుపై దాడి, నాభర్తకు !

కారుపై దాడి, నాభర్తకు !

ఇటీవల తన కారుమీద దాడి జరిగిందని, తన భర్త మీద దాడి చేశారని, గుర్తు తెలియని వ్యక్తులు నాభర్తకు ఫోన్లు చేసి చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఇక్కడ ఉన్న నా ఇంటి దగ్గర పోలీసు భద్రత కల్పించాలని రాజ్యసభ సభ్యురాలు ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

మామాట వినడం లేదు

మామాట వినడం లేదు

శుక్రవారం ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి పిటిషన్ విచారణకు స్వీకరించారు. ఈ సందర్బంలో ఢిల్లీ పోలీసులు కోర్టు ముందు హాజరైనారు. శశికళ పుష్ప తమ మాట వినడం లేదని, మమల్ని లెక్కచెయ్యడం లేదని, ఇలాంటి సమయంలో మేము ఎలా భద్రత కల్పించాలని పోలీసులు కోర్టు ముందువాపోయారు.

ఒక్క మాట చెప్పకుండా వెళ్లిపోతారు

ఒక్క మాట చెప్పకుండా వెళ్లిపోతారు

శశికళ పుప్ప ఇంటి దగ్గర ఇప్పటికే భద్రత కల్పిస్తున్నామని పోలీసులు కోర్టులో చెప్పారు. అయితే ఇంటి దగ్గర ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమె సొంత నిర్ణయాలు తీసుకుని బయటకు వెళ్లిపోతున్నారని కోర్టులో చెప్పారు.

ఇప్పటికే వీఐపీ భద్రత కల్పించాం

ఇప్పటికే వీఐపీ భద్రత కల్పించాం

శశికళ పుష్పకు ఇప్పటికే వీఐపీ భద్రత కల్పిస్తున్నామని ఢిల్లీ పోలీసులు హైకోర్టులో చెప్పారు. సెక్యూరిటీ సిబ్బందికి సమాచారం ఇవ్వకుండా బయటకు వెలుతున్న ఆమె ఎక్కడున్నారని వెతుక్కుంటూ వెళ్లి తాము భద్రత కల్పించాలో అర్థం కావడం లేదని పోలీసు అధికారులు కోర్టులో చెప్పారు.

అధికారులను ఆమె లెక్కచెయ్యరు

అధికారులను ఆమె లెక్కచెయ్యరు

రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప పోలీసు అధికారులంటే లెక్కచెయ్యరని, ఇప్పుడు కల్పిస్తున్న భద్రత కంటే తాము ఎక్కువ సిబ్బందిని ఆమె ఇంటి దగ్గర నియమించడానికి వీలుకాదని సీనియర్ పోలీసు అధికారుల తరపున రాహుల్ మిశ్రా కోర్టులో చెప్పారు.

శశికళ పుష్పకు షాక్

శశికళ పుష్పకు షాక్

శశికళ పుష్ప, పోలీసుల వాదన విన్న న్యాయస్థానం ఆమె సమర్పింపిన పిటిషన్ ను కొట్టివేసింది. పోలీసుల వాదన పరిగణలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ దెబ్బతో శశికళ పుష్పకు గట్టి షాక్ తగిలింది. ఈమె ఇంతటిలో వదిలేస్తారా ? లేక సుప్రీం కోర్టును ఆశ్రయిస్తారా ? అనే విషయం వేచి చూడాలి.

English summary
The Delhi police told the court that Sasikala Pushpa was already being provided with security like a VIP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X