వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Delhi violence: ఆ ఇద్దరికీ బెయిల్: జామియా స్టూడెంట్‌కూ: ప్రశాంత్ కీలక కామెంట్స్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన జాతీయ పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశ రాజధానిలో చెలరేగిన అల్లర్లు, హింస నేపథ్యంలో అరెస్టయిన పింజ్రా టాడ్ కార్యకర్తలు దేవాంగన కళిత, నటాషా నర్వల్‌లకు ఊరట లభించింది. ఢిల్లీ హైకోర్టు వారికి బెయిల్ మంజూరు చేసింది. వారిద్దరితో పాటు జామియా మిల్లియా ఇస్లామియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఆసిఫ్ ఇక్బాల్ తన్హాకూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది ఢిల్లీ హైకోర్టు. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్, జస్టిస్ అనూప్ జె భంభాణీలతో కూడిన బెంచ్ ఉత్తర్వులు జారీ చేసింది.

ఒక్కొక్కరికి 50 వేల రూపాయల పూచికత్తు, ఇద్దరు స్థానికులను సాక్షులుగా పేర్కొంటూ బెయిల్ పిటీషన్లపై సంతకాలు చేయాల్సి ఉంటుందని ఆదేశించింది. గత ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలో పెద్ద ఎత్తున చెలరేగిన అల్లర్లు, హింసలకు పింజ్రా టాడ్ కార్యకర్తలే ప్రధాన కారణమంటూ అప్పట్లో వారిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. వారిపై ఉగ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసులు నమోదు చేశారు. దేవాంగన కళిత, నటాషా నర్వల్ ఇద్దరూ ప్రతిష్ఠాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పీహెచ్‌డీ స్కాలర్లు.

 Delhi High Court grants bail to Pinjra Tod activists Devangana Kalita and Natasha Narwal

కాగా ఆసిఫ్ ఇక్బాల్ తన్హా జామియా యూనివర్శిటీలో బీఏ థర్డ్ ఇయర్ విద్యార్థి. వారు ముగ్గురూ పింజ్రా టాడ్ అసోసియేట్ అయ్యారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటుండేవారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని నిరసిస్తూ ఢిల్లీ ఈశాన్య ప్రాంతంలోని సీలంపూర్ మదీనా మసీదు వద్ద పింజ్రా టాడ్ నిర్వహించిన ఉద్యమాల్లో వారు పాల్గొన్నారు. ఆందోళనకారులతో కలిసి పెద్ద ఎత్తున ఛక్కా జామ్ చేపట్టారు. అప్పట్లో చోటు చేసుకున్న హింసాత్మక ఆందోళనల్లో వారి ప్రమేయం ఉందనే కారణంతో యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు.

జగన్ సర్కార్ స్ట్రాంగ్ డెసిషన్: డిగ్రీలో విద్యాబోధన ఆ లాంగ్వేజ్‌లోనే: టీడీపీకి మరో ఛాన్స్జగన్ సర్కార్ స్ట్రాంగ్ డెసిషన్: డిగ్రీలో విద్యాబోధన ఆ లాంగ్వేజ్‌లోనే: టీడీపీకి మరో ఛాన్స్

న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టగా.. కస్టడీకి తరలించింది. అప్పటి నుంచి బెయిల్ కోసం ప్రయత్నాలు సాగిస్తోన్నారు. దేవాంగన కళిత, నటాషా నర్వల్ తరఫున ఆదిత్ ఎస్ పుజారీ, తుషారికా మట్టూ, కునాల్ నేగి వంటి సీనియర్ న్యాయవాదులు వాదించారు. ఇదే కేసులో అరెస్టయిన ఆసిఫ్ తరఫున సౌజన్యా శంకరన్, సిద్ధార్థ్ అగర్వాల్, అభినవ్ శెఖారీ, నికిత ఖైతాన్ తమ వాదనలను వినిపించారు. ఆ ముగ్గురికీ తాజాగా బెయిల్ లభించింది. ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం పట్ల సీనియర్ అడ్వొకేట్ ప్రశాంత్ భూషణ్ హర్షం వ్యక్తం చేశారు.

English summary
Delhi High Court grants bail to Pinjra Tod activists Devangana Kalita and Natasha Narwal and Jamia student Asif Iqbal Tanha, arrested under Unlawful Activities (Prevention) Act, in connection with northeast Delhi violence case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X