వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హైకోర్టులో డీకే శివకుమార్ కు ఎదురు దెబ్బ, తీహార్ జైలే, తమ్ముడికి సమన్లు, పాపం!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అక్రమ నగదు లావాదేవీలు, మనీ లాండరింగ్ స్కాంలకు సంబంధించి అరెస్టు అయ్యి తీహార్ జైలులో ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, ట్రబుల్ షూటర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు డీకే. శివకుమార్ కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. సోమవారం డీకే. శివకుమార్ కు బెయిల్ రాకపోవడంతో ఆయనతో పాటు ఆయన అనుచరులు నిరాశకు గురైనారు. ఇదే సమయంలో డీకే. శివకుమార్ సోదరుడు, కాంగ్రెస్ ఎంపీ డీకే. సురేష్ కు ఈడీ అధికారులు విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేశారు.

హనీట్రాప్, దుబాయ్ రిటన్, కాలేజ్ అమ్మాయితో వల, రాసలీలలు టీవీలో చూపిస్తాం !హనీట్రాప్, దుబాయ్ రిటన్, కాలేజ్ అమ్మాయితో వల, రాసలీలలు టీవీలో చూపిస్తాం !

14 రోజులు అవకాశం

14 రోజులు అవకాశం

సోమవారం ఢిల్లీ హైకోర్టులో డీకే శివకుమార్ బెయిల్ అర్జీ విచారణ జరిగింది. న్యాయమూర్తి సురేష్ కుమార్ నేతృత్వంలోని ఏకసభ్య బెంచ్ బెయిల్ అర్జీ విచారణ చేసింది. డీకే. శివకుమార్ తనకు బెయిల్ కచ్చితంగా వస్తుందని ఎదురు చూశారు. అయితే డీకే. శివకుమార్ బెయిల్ అర్జీ విచారణ చేసిన న్యాయమూర్తి సురేష్ కుమార్ అభ్యర్థనలు ఉంటే చెప్పాలని ఈడీ అధికారులకు సూచిస్తూ అక్టోబర్ 14వ తేదీకి విచారణ వాయిదా వేశారు. బెయిల్ రాకపోవడంతో డీకే. శివకుమార తీహార్ జైలులోనే ఉన్నారు.

ఈడీ, హైకోర్టులో నో బెయిల్

ఈడీ, హైకోర్టులో నో బెయిల్

సెప్టెంబర్ 25వ తేదీ డీకే శివకుమార్ బెయిల్ ఇవ్వాలని ఢిల్లీలోని ఈడీ ప్రత్యేక న్యాయస్థానంలో మనవి చేశారు. అయితే ఈడీ ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి అజయ్ కుమార్ కుహర్ బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. డీకే శివకుమార్ కు బెయిల్ నిరాకరించడంతో ఆయన న్యాయవాదులు గురువారం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ హైకోర్టు సోమవారం అర్జీ విచారణ చేస్తామని చెప్పింది. సోమవారం డీకే. శికుమార్ బెయిల్ అర్జీ విచారణ చేసిన ఢిల్లీ హైకోర్టు విచారణ 14వ తేదీకి వాయిదా వేసింది. బెయిల్ రాకపోవడంతో డీకే. శివకుమార్ షాక్ కు గురైనారు.

రేపు కోర్టు ముందుకు డీకే

రేపు కోర్టు ముందుకు డీకే

మంగళవారానికి డీకే శివకుమార్ రిమాండ్ గడువు పూర్తి కానుంది. మంగళవారం తీహార్ జైలులో ఉన్న డీకే శివకుమార్ ను ఈడీ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు. విచారణ సమయంలో డీకే. శివకుమార్ అక్రమ ఆస్తుల వివరాలు సేకరించిన ఈడీ అధికారులు వాటిని మంగళవారం కోర్టు ముందు సమర్పించే అవకాశం ఉంది.

బెయిల్ ఇస్తే సాక్షాలు !

బెయిల్ ఇస్తే సాక్షాలు !

కేసు విచారణ కొలిక్లి వచ్చే సమయంలో డీకే శివకుమార్ కు బెయిల్ ఇస్తే ఆయన రాజకీయ పలుకుబడి ఉపయోగించి సాక్షాలు తారుమారు చేసే అవకాశం ఉందని ఆయన రిమాండ్ గడువును పొడగించాలని కోర్టు ముందు మనవి చేసే అవకాశం ఉంది. ఈడీ అధికారులు గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేస్తే డీకే. శివకుమార్ కు బెయిల్ వచ్చే అవకాశం తాలా తక్కువుగా ఉంటుందని న్యాయనిపుణులు అంటున్నారు.

డీకే కూతురు ఐశ్వర్య

డీకే కూతురు ఐశ్వర్య

డీకే. శివకుమార్ తో పాటు ఆయన కుమార్తె ఐశ్వర్యను ఈడీ అధికారులు విచారణ చేసి వివరాలు సేకరించారు. ఐశ్వర్య బ్యాంకు అకౌంట్ల నుంచి భారీ మొత్తంలో నగదు లావాదేవీలు జరిగాయని గుర్తించిన ఈడీ అధికారులు వాటి వివరాలు సేకరించారు. 2017 ఆగస్టు 2వ తేదీన ఢిల్లీలోని డీకే. శివకుమార్ నివాసంలో, ఆయన సన్నిహితుల నివాసాల్లో ఆదాయపన్పు శాఖ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో అధికారులు రూ. 8.59 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఆదాయపన్ను శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్న నగదుకు సరైన పత్రాలు లేవని, అక్రమంగా నగదు లావాదేవీలు జరిగాయని ఆరోపిస్తూ ఈడీ అధికారులు డీకే. శివకుమార్ ను అరెస్టు చేశారు.

English summary
Delhi High Court on Monday adjourned bail plea of former minister DK Shivakumar who is in Tihar Jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X