• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

బీజేపీ నేతల విద్వేష ప్రసంగాల వీడియోలివే, చర్యలు తీసుకోండి: హైకోర్టులోనే ప్రదర్శన, పోలీసులకు ఆదేశాలు

|

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో గత మూడు రోజులుగా జరుగుతున్న అల్లర్లపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్వేషపూరిత ప్రసంగాలు చేసిన బీజేపీ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించింది. అయితే, విద్వేషపూరిత ప్రసంగాలు చేసినట్లు తమకు ఎలాంటి వీడియోలు లభించలేదని పోలీసులు కోర్టుకు చెప్పారు.

బాధ్యులపై చర్యలు తీసుకోండి..

బాధ్యులపై చర్యలు తీసుకోండి..

ఈ క్రమంలో సంబంధిత నాలుగు వీడియోలను కోర్టులో ప్రదర్శించారు. ఆ వీడియోలను చూసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. డీసీపీ, పలువురు న్యాయవాదులు, సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా ఈ వీడియోలను వీక్షించారు. మీ కమిషనర్ కార్యాలయంలో కొన్ని టీవీలు ఏర్పాటు చేసుకోవాలని కోర్టు పోలీసులపై సూచించింది.

మొదటి వీడియో: కపిల్ మిశ్రా, బీజేపీ నేత

మొదటి వీడియో: కపిల్ మిశ్రా, బీజేపీ నేత

మౌజపూర్ చౌక్‌లో బీజేపీ నేత కపిల్ మిశ్రా చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో హైకోర్టులో ప్రదర్శించడం జరిగింది. విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసినట్లు ఆ వీడియోలో ఉన్నట్లు తెలిసింది. పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిని వీధుల నుంచి వెళ్లగొట్టాలని పోలీసులకు ఆదివారం ఆయన అల్టిమేటం జారీ చేశారు. జఫ్రాబాద్, చాంద్ బాగ్ ప్రాంతాల్లోని సీఏఏ ఆందోళనకారులను మూడు రోజుల్లోగా చేయాలని పోలీసులకు తేల్చి చెప్పారు. అంతేగాక, డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో ఉండేంతవరకు తాము శాంతంగా ఉంటామని, ఆ తర్వాత పోలీసులు చెప్పినా తాము వినబోమని మిశ్రా వ్యాఖ్యానించారు. తామే రోడ్లపైకి వస్తామని అన్నారు. సీఏఏ నిరసనకారులకు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ఆయనకిదే మొదటిసారేం కాదు, గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.

వీడియో 2: పర్వేశ్ వర్మ, బీజేపీ నేత

వీడియో 2: పర్వేశ్ వర్మ, బీజేపీ నేత

బీజేపీ నేత పర్వేశ్ వర్మ ప్రసంగానికి సంబంధించిన వీడియోను కూడా కోర్టులో ప్రదర్శించడం జరిగింది. షాహీన్‌బాగ్‌లో సీఏఏకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నవారంతా రేపిస్టులు, హంతకులని వ్యాఖ్యానించారు. జనవరి 28న ఈ బీజేపీ ఎంపీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. షాహీన్‌బాగ్‌లో లక్షలాది మంది చేరడంపై ఢిల్లీ ప్రజలు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి. వారు మీ ఇళ్లల్లోకి దూరి మీ అక్కాచెల్లెళ్లను, కూతుర్లను అత్యాచారం చేస్తారు. చంపుతారు. ఇవాళే సమయం ఉంది.. రేపు మిమ్మల్ని కాపాడేందుకు మోడీజీ, అమిత్ షా కూడా రాలేరు అని పర్వేశ్ వర్మ వ్యాఖ్యానించారు.

ఎన్నికల ముందు ఢిల్లీలోని ఓ ర్యాలీలో మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వచ్చిన గంటలోపే షాహీన్‌బాగ్‌లోని ఆందోళనకారులను అక్కడ్నుంచి పంపించి వేస్తామన్నారు. అంతేగాక, అధికారంలోకి వచ్చిన నెలలోపే తన నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల్లో నిర్మించిన అన్ని మసీదులను కూల్చివేస్తామని అన్నారు.

వీడియో 3: అనురాగ్ ఠాకూర్, బీజేపీ కేంద్రమంత్రి

వీడియో 3: అనురాగ్ ఠాకూర్, బీజేపీ కేంద్రమంత్రి

రిథాలా బీజేపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసిన సమయంలో కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. గోలీ మారో నినాదాలు చేసిన విషయం తెలిసిందే. దేశ ద్రోహులను కాల్చిపారేయాల్సిందే అంటూ నినాదాలు చేశారు. సీఏఏకు వ్యతిరేకంగా నిరసన చేపట్టినవారిపై విమర్శలు గుప్పించారు. సీఏఏకు నిరసనగా షాహీన్ బాగ్‌లో చేస్తున్న నిరసనల్లో భారత్‌కు వ్యతిరేక నినాదాలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు.

  India vs Pak Polls On February 8 || Oneindia Telugu
  వీడియో 4: అభయ్ వర్మ, బీజేపీ ఎమ్మెల్యే

  వీడియో 4: అభయ్ వర్మ, బీజేపీ ఎమ్మెల్యే

  మంగళవారం బీజేపీ ఎమ్మెల్యే అభయ్ వర్మ చేసిన వ్యాఖ్యలను కోర్టులో ప్రదర్శించారు. పోలీసులను చంపినవారిని హతమార్చాలంటూ నినాదాలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాను ఆ ప్రాంతంలో బలవంతంగా మూసివేయబడిన షాపులను తిరిగి తెరిచేందుకు కోసం వెళ్లాలని, ఎలాంటి నినాదాలు చేయాలని తాను కోరలేదని, వద్దనే చెప్పానని ఓ మీడియాకు ఆయన చెప్పారు.

  English summary
  The Delhi High Court on Wednesday reprimanded the police in the national capital for not taking action against Bharatiya Janata Party (BJP) leaders accused of giving provocative hate speeches.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X