వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రైవేటు పాఠశాలల ఫీజుల పెంపుపై హైకోర్టు స్టే

ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపునకు అనుమతిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను బుధవారం ఢిల్లీ హైకోర్టు నిలిపేసింది. ఈ ఆదేశాలపై విద్యార్థుల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపునకు అనుమతిస్తూ ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపేసింది. ఏడో వేతన సంఘం నివేదిక నేపథ్యంలో ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల పెంపుపై ఢిల్లీ సర్కారు ఒక సర్క్యులర్‌ను జారీ చేసింది.

ఈ ఆదేశాలపై విద్యార్థుల పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు విచారణకు స్వీకరించింది. న్యూఢిల్లీలోని మయూర్ విహార్‌కు చెందిన 100 మంది ఏఎస్ఎన్ పబ్లిక్ స్కూల్‌ విద్యార్థులు ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.

delhi-high-court

కేజ్రీవాల్ ప్రభుత్వం అక్టోబరులో ఓ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ భూమిలో ఏర్పాటు చేసిన రికగ్నయిజ్డ్ అన్ ఎయిడెడ్ ప్రైవేట్ స్కూళ్ళు తమ విద్యార్థుల ఫీజులను 15 శాతం వరకు పెంచుకోవచ్చునని పేర్కొంది.

ఏడో వేతన సవరణ సంఘం సిఫారసుల అమలుకు వీలు కల్పించేందుకు ఈ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల పెంపుపై విద్యార్థులు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు.

యథేచ్ఛగా ఫీజులు పెంచుతూ, తమను వేధిస్తున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రభుత్వానికి ఫిర్యాదు చేయగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందిస్తూ అలాంటి ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

English summary
In a major relief to agitating parents, the Delhi High Court on Wednesday stayed the order passed by the state Education Department, which enabled private schools to increase fees by 15 percent.The government circular was issued, apparently, to enable schools to pay the teachers salary as per the recommendations of the Seventh Pay Commission.The Delhi High Court order was issued while hearing a petition filed by around 100 students of ASN senior secondary school Mayur Vihar. Khagesh Jha, the advocate who argued on behalf of the petitioner told Firstpost, “We submitted to the court that the order approving the increase in fees was passed by the Delhi government in collusion with the private schools. The schools have enough funds to pay the teachers’ salary as per the recommendation of the Seventh Pay Commission and hence need not increase fees to do the same.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X