వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గంజాయి వినియోగంలో ఢిల్లీ టాప్...గ్రాము ధర ఎంతో తెలుసా..?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నో ఘటనలకు వేదికగా నిలుస్తోంది. రాజకీయ వేడి, అధికారం, దీంతో పాటు ఎన్నో అంశాల్లో ఢిల్లీ ముందువరసలో ఉంటుంది. ఇక తాజాగా ఢిల్లీ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ విషయం కాస్త ఆందోళన కలిగించేది కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా గంజాయి వినియోగంలో ఢిల్లీ నగరం మూడో స్థానంలో ఉన్నట్లు ఓ పరిశోధన ద్వారా తెలుస్తోంది. 38వేల 260 కిలోల గంజాయిని ఢిల్లీ నగరంలో వినియోగిస్తున్నట్లు ఈ స్టడీ పేర్కొంది.

హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!హెల్మెట్, లైసెన్స్ లేకుండా వెళ్తున్నారా?: అంతా బీహార్ పోలీసులే చూసుకుంటారు!

2018 కానబిస్ ప్రైస్ ఇండెక్స్ అనే స్టడీ ద్వారా పలు ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. తాజాగా ఈ స్టడీ లేటెస్ట్ లెక్కలను విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 120 నగరాలను ఎంపిక చేసి అందులో గంజాయి ఎక్కువగా వినియోగిస్తున్న నగరాల జాబితాను బయటపెట్టింది. ఈ స్టడీ ప్రకారం టాప్‌టెన్ నగరాల జాబితాలో ఢిల్లీకి గంజాయి వినియోగంలో మూడో స్థానం దక్కింది. ఢిల్లీకంటే ముందు అమెరికాలోని న్యూయార్క్ నగరం, పాకిస్తాన్‌లోని కరాచీ నగరాలు ఉన్నాయి.అంతేకాదు ముంబై నగరం కూడా గంజాయి వినియోగంలో టాప్ టెన్ జాబితాలో ఉంది.ముంబై నగరం ఆరవ స్థానంలో నిలిచింది. ఈ మహానగరంలో గంజాయి వినియోగం 32,389 కిలోలు ఉన్నట్లు స్టడీ వెల్లడించింది.

Delhi is 3rd highest consumer of cannabis after New york and Karachi

ఇక ఢిల్లీలో దొరుకుతున్న గంజాయి ధర కూడా ఇతర ప్రపంచ నగరాలతో పోలిస్తే చాలా తక్కువని స్టడీ వెల్లడించింది. గ్రాము గంజాయి ధర 4.38 అమెరికా డాలర్లు అంటే భారత కరెన్సీలో దీని ధర రూ.315గా తేల్చింది. అయితే గంజాయిపై పన్ను విధింపులో మాత్రం భారత ప్రస్తావన లేదని స్టడీ తెలిపింది. అంటే గంజాయిపై పన్ను విధిస్తే తద్వారా వచ్చే లాభం మిగతా ప్రపంచ నగరాలతో పోలిస్తే ఏమి ఉండదని వెల్లడించింది. ఇక ఆమ్స్‌టర్ డామ్‌లో ఎక్కువగా వినియోగించే మత్తు పదార్థాల్లో గంజాయి వినియోగంలో 56వ స్థానంలో నిలిచింది. ఆమ్స్‌టర్‌డామ్‌ నగరంలో 3.6 టన్నుల గంజాయిని వినియోగిస్తున్నారని స్టడీ పేర్కొంది.

English summary
Delhi, known for running high on politics, power and Punjabi music, now appears to be running high on weed.According to a new study, Delhi is the third largest consumer of cannabis in the world, having consumed 38.26 metric tonnes or 38,260 kg.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X