వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జర్నలిస్ట్ రాజీవ్ శర్మ అరెస్ట్: ఓఎస్ఏ కింద అదుపులోకి.. రెండు వీడియోలు అప్‌లోడ్..

|
Google Oneindia TeluguNews

జర్నలిస్ట్ రాజీవ్ శర్మను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యుహాత్మక వ్యవహారాల విశ్లేషకుడు, రచయిత శర్మను ఈ నెల 14వ తేదీన అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద రక్షణ సంబంధిత పత్రాలు లభించాయని అభియోగం మోపారు. కేసు విచారణ జరుగుతుందని.. విచారణ క్రమంలో పూర్తి వివరాలు వెలుగుచూస్తాయని చెబుతున్నారు.

యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా, ద ట్రిబ్యూన్, సాకాల్ టైమ్స్ వార్తాసంస్థల్లో రాజీవ్ శర్మ పనిచేశారు. ఇటీవల చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్‌లో ఒక ఆర్టికల్ కూడా రాశారు. 15వ తేదీన శర్మను మేజిస్ట్రేట్ వద్ద హాజరుపరచగా ఆరు రోజుల కస్టడీకి ఇచ్చారని స్పెషల్ సెల్ డీసీపీ తెలిపారు. అతనిని నైరుతి ఢిల్లీలో గల పీతంపురంలో అదుపులోకి తీసుకున్నామని.. రక్షణ పత్రాలకు సంబంధించి విచారిస్తున్నామని తెలిపారు.

Delhi journalist Rajeev Sharma arrested under OSA..

రాజీవ్ శర్మకు ఒక యూ ట్యూబ్ చానెల్ కూడా ఉంది. రాజీవ్ కిష్కింధ పేరుతో చానెల్ రన్ చేస్తున్నారు. చానెల్‌కు 11 వేల 900 మంది సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. శర్మ అరెస్ట్ అయ్యే రోజు తన చానెల్‌లో రెండు వీడియోలను అప్ లోడ్ చేశాడు. అందులో ఒకటి 8 నిమిషాల నిడివిగల వీడియో.. అందులో చైనా ఇప్పటికీ అలర్లు చేయవచ్చు అని పేర్కొన్నారు.

Recommended Video

AgustaWestland : Former CAG & IAF officials విచారణకు అనుమతి కోరిన CBI || Oneindia Telugu

ఆ రోజు మాస్కోలో భారత్-చైనా విదేశాంగ మంత్రులు సమావేశం అయిన రోజే వీడియోలు పోస్ట్ చేయడం విశేషం. మరో వీడియో 4 నిమిషాల ఉంది. దేశంలో మీడియో పరిస్థితి దారుణంగా ఉంది అని హిందీలో ఉంది. దేశంలో మీడియా వాచ్ డాగ్‌లా ఉండాలి కానీ.. లాప్ డాగ్‌లా మారిందని విమర్శించారు.

English summary
Delhi Police Special Cell has arrested a city-based strategic affairs analyst and author Rajeev Sharma.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X