వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, వైరస్ సోకిన వారు 5 రోజులు హోం క్వారంటైన్ కంపల్సరీ

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ఢిల్లీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వైరస్ లక్షణాలు కనిపించిన వారికి విధిగా ఐదురోజులు ఇన్ స్టిట్యూషనల్ క్వారంటైన్ విధిస్తామని స్పష్టంచేసింది. దీనికి సంబంధించి లెప్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ ఉత్తర్వులు కూడా జారీచేశారు. కొత్త రూల్స్ ప్రకారం.. కరోనా వైరస్ సోకిన వ్యక్తి ఐదురోజులు హోం క్వారంటైన్‌లో ఉండాల్సిందే. సదరు రోగికి వైరస్ లక్షణాలు లేకుంటేనే క్వారంటైన్ కేంద్రం నుంచి బయటకు వచ్చేందుకు అనుమతిస్తారు.

Delhi L-G orders institutional quarantine for 5 days

అలాకాకుండా రోగికి పరిస్థితి సీరియస్‌గా మారితే వెంటనే అతడు/ఆమెను ఆస్పత్రికి తీసుకెళతారు. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరిగిపోతున్నాయి. వైరస్ సోకిన వ్యక్తులు హోం క్వారంటైన్‌లో లేకపోవడంతో కేసులు పెరిగాయని.. హోంశాఖ తెలిపింది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. క్వారంటైన్‌లో ఉన్నవారికి సంబంధించి జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షిస్తారని పేర్కొన్నది. దీంతో లోపాలు జరిగే అవకాశం లేదు.

ఐసీఎంఆర్ మార్గదర్శకాల మేరకు హోం ఐసోలేషన్ చక్కగా పనిచేసిందని అధికారులు పేర్కొన్నారు. దీంతో స్వల్ప లక్షణాలు ఉన్నవారు కూడా టెస్టులు చేయించుకుంటారని పేర్కొన్నారు. వైరస్ కేసుల నేపథ్యంలో జూలై నాటికి 80 వేల పడకలు సిద్ధం చేశామని తెలిపారు.

English summary
Delhi Lt Governor Anil Baijal passed an order on Friday putting an end to the Delhi government's home quarantine strategy.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X