వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో బిజెపి ప్రభుత్వం, దొంగదారిలో అధికారంలోకి..!

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: న్యూఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి అత్యధిక మోజరిటీ గల పార్టీగా భాజపాకు ఆహ్వానం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. న్యూఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి 49 రోజులకే అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయండతో ఢిల్లీలో గత ఫిబ్రవరి నుండి రాష్ట్రపతి పాలన అమలులో ఉన్న సంగతి తెలిసిందే.

ఢిల్లీ లెప్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆహ్వానించడానికి అనుమతి కోరుతూ రాష్టపతికి లేఖ రాశారు. రాష్ట్రపతి ఆ లేఖను కేంద్ర హొం మంత్రిత్వ శాఖకు పంపినట్లు సమాచారం. ఢిల్లీ శాసనసభలో 32 మంది సభ్యులున్న భాజపా శాసనసభ్యుల్లో హర్షవర్దన్, రమేష్ బిధురి, ప్రవీణ్ వర్మ లోక్ సభ్యులుగా గెలుపొందడంతో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి 29 మంది సభ్యులున్నారు. . ఆమ్ ఆద్మీ పార్టీకి 28 సభ్యులుండగా.. కాంగ్రెస్‌కి 8 మంది సభ్యులున్నారు.

Delhi likely to get a BJP government, AAP cries foul

ప్రభుత్వం ఏర్పాటుకు మరో ఐదుగురు సభ్యుల మద్దతు అవసరం. ఐతే భాజపా ఢిల్లీ అధ్యక్షడు సతీశ్ ఉపాధ్యాయ ఈ విషయంపై స్పందిస్తూ ప్రభుత్వం ఏర్పాటుచేసే పరిస్దితిపై సమీక్షిస్తున్నామన్నారు. ఏప్రిల్-మే నెలల్లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఢిల్లీలో ఉన్న ఏడు లోక్ సభ స్దానాలను భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది. ఐతే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి.

ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ దొంగదారిలో అధికారంలోకి రావడానికి అంగీకరించబోమని ఈరోజు ఉదయం పలువురు నేతలు ట్విట్టర్‌లో వ్యాఖ్యానిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసే పిటిషన్ సెప్టెంబర్ 9న సుప్రీంకోర్టు విచారించనుంది.

English summary
Amid reports that lieutenant governor Najeeb Jung may invite the Bharatiya Janata Party (BJP) to form government in Delhi, AAP leader Manish Sisodia said on Friday that the saffron party did not have the courage to face fresh elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X