వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా కల్లోలం- ఢిల్లీ కీలక నిర్ణయం-5 రాష్ట్రాల నుంచి వచ్చేవారికి పరీక్షలు తప్పనిసరి

|
Google Oneindia TeluguNews

దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రభావం పెరుగుతోంది. మహారాష్ట్ర, కేరళతో పాటు పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులపై మిగతా రాష్ట్రాలు ఆంక్షలు విధించడం మొదలుపెట్టాయి. కరోనా పరీక్షలను తప్పనిసరి చేస్తున్నాయి. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో అక్కడి కేజ్రివాల్‌ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఎల్లుండి నుంచి మార్చి 15 వరకూ ప్రయాణాలు చేసే వారికి మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుంది. ఇలా కరోనా పరీక్షలు తప్పనిసరి చేసిన రాష్ట్రాల ప్రయాణికుల్లో మహారాష్ట్ర, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, ఛత్తీస్‌ఘడ్‌ ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాల ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇవాళ అధికారికంగా ప్రకటించనుంది.

delhi makes covid test mandatory for travellers from 5 states including maharastra, kerala

ఈ ఐదు రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా వైరస్‌ నెగెటివ్‌ రిపోర్టు తీసుకొస్తేనే ఢిల్లీలోకి అనుమతిస్తారు. ఢిల్లీలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకూ నమోదైన 6.38 లక్షల పాజిటివ్‌ కేసుల్లో 6.26 లక్షల మంది కోలుకున్నారు. 10903 మంది చనిపోయారు. ప్రస్తుతం ఢిల్లీలో 639 కంటోన్‌మెంట్‌ జోన్లు ఉన్నాయి. పెద్ద ఎత్తున ఆర్టీ పీసీఆర్‌ టెస్టులు చేస్తున్నా కేసుల సంఖ్య మాత్రం ఇంకా అదుపులోకి రావడం లేదు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతోంది.

English summary
Travellers from Maharashtra, Kerala, Chhattisgarh, Madhya Pradesh and Punjab will need a negative coronavirus test report to enter Delhi from February 26 to March 15, Agencies reported on Wednesday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X