వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నన్ను పెళ్లి చేసుకో అని యోగి మార్ఫింగ్ వీడియో ట్వీట్ : నిందితుడి అరెస్ట్

|
Google Oneindia TeluguNews

లక్నో/ న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. చేతిలో స్మార్ట్ ఫోనో ఉంటే చాలు రెచ్చిపోతున్నారు. తమ భావజాలాన్ని ఇతరులపైకి రుద్ది .. ఆనందం పొందుతున్నారు. ఇలా రాజకీయ నేతుల, సినీతారుల, క్రీడాకారులపై తమ పైత్యాన్ని ప్రదర్శించి పైశాచిక ఆనందాన్ని పొందుతున్నారు. యూపీకి చెందిన ఓ వ్యక్తి కూడా ఇలానే పోస్టులు పెట్టి .. జైల్లో ఊచలు లెక్కబెడుతున్నాడు.

పెళ్లి చేసుకో ..
యూపీకి చెందిన ప్రశాంత్ కనౌజ .. ఇదివరకు మీడియాలో పనిచేశాడు. కానీ తన పైత్యాన్ని మాత్రం వీడలేదు. ఇటీవల యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు సంబంధించి ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అందులో ఓ మహిళ తనను పెళ్లి చేసుకోవాలని యోగి ఆదిత్యనాథ్‌ను కోరుతుంది. యోగి ఆదిత్యనాథ్ బ్రహ్మచారి అనే విషయం తెలిసిందే. ఆ మహిళ వీడియో ముందు యోగి ఫోటో మార్పింగ్ చేసి .. ప్రశాంత్ పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీనిని తన ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు. దీంతో వీడియో వైరలవడంతో .. పోస్ట్ పెట్టిన ప్రశాంత్‌పై పోలీసులు చర్యలు తీసుకున్నారు.

Delhi man arrested for tweet on Yogi Adityanath, TV channel head held in similar case

పరువుకు భంగం ..
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పరువు భంగం కలిగించారని పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతోపాటు ఐటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. తప్పుడు సమాచారంతో, సోషల్ మీడియాలో తప్పుపట్టించారనే అభియోగం కింద కేసు పెట్టారు. దీంతోపాటు 67, ఐటీ 500, 505 సెక్షన్ల కింద కేసు కట్టారు.

Delhi man arrested for tweet on Yogi Adityanath, TV channel head held in similar case

దీంతోపాటు యూపీ సీఎం యోగి పరువుకు భంగం కలింగించారని టీవీ చానెల్ ఎడిటర్ పై కూడా మరో కేసు నమోదు చేశారు పోలీసులు. జూన్ 6న జరిగిన చర్చ కార్యక్రమంలో .. యోగి ఆదిత్యనాథ్ పై మహిళ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు ఆ చానెల్ కూడా సరైన అనుమతులు తీసుకోకుండా నడుపుతున్నారని పోలీసులు గుర్తించారు. చానెల్ పై ఫోర్జరీ .. తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు పెట్టినట్టు ఎస్పీ వైభవ్ కృష్ణ పేర్కొన్నారు.

English summary
The Uttar Pradesh Police arrested a man from Delhi for sharing an "objectional" post on social media that was about Uttar Pradesh Chief Minister Yogi Adityanath. The man, identified as Prashant Kanaujia, has been booked under charges of defamation and transmitting indecent material in electronic form. According to his social media accounts, Prashant was earlier associated with some media organisations. Kanaujia was arrested over a video he shared on his Twitter and Facebook profiles. The video shows a woman repeatedly expressing her desire to marry Yogi Adityanath. According to the police, Prashant Kanaujia's comment on the video had maligned the image of the chief minister.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X