• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రాత్రయితే మహిళలకు పోర్న్ వీడియోలు.. కారణం విని పోలీసులకే షాక్

|

న్యూఢిల్లీ : రాత్రయిందంటే చాలు.. మొబైల్ కు పోర్న్ వీడియోలు వస్తూనే ఉంటాయి. ఒకటి రెండు రోజులు కాదు, ఒకరిద్దరికి అంతకన్నా కాదు, దాదాపు 1500 మంది మహిళలకు నిత్యం ఇదో నరకమైపోయింది. దీనంతటకి కారణమైన 31 ఏళ్ల మహమ్మద్ ఖలీద్ ను ఇటీవలే ఢిల్లీ పోలీసులు అరెస్టు చేయడంతో, పోర్న్ వీడియోల బెడద నుంచి తప్పించుకున్నారు మహిళలు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రోజంతా ఏదో ఒక నంబర్ కు ఫోన్ చేయడం, ఒకవేళ ఆ నంబర్ ఆడవాళ్లదయితే నంబర్ సేవ్ చేసుకోవడం, తర్వాత వాట్సాప్ ద్వారా సదరు నంబర్ కలిగిన మహిళలను వెతకడం, ఒకవేళ అమ్మాయి అందంగా గనుక కనిపిస్తే.. ఇక ఆరోజు రాత్రి నుంచి పోర్న్ వీడియోలతో, అశ్లీల ఫోటోలతో సదరు మహిళలకు మెసేజ్ లు పంపించడం మహమ్మద్ ఖలీద్ కు ఓ దినచర్యలా మారిపోయింది.

సర్దార్ బజార్ లోని ఓ మొబైల్ షాపులో పోలీసులు ఖలీద్ ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి మూడు సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ మూడు సిమ్ కార్డులు తప్పుడు పేర్ల మీద ఉన్నట్టుగా గుర్తించారు. దాదాపు ఢిల్లీ పరిసర ప్రాంతాల్లోని మొత్తం 2000 మందికి సంబంధించిన మహిళల ఫోన్ నంబర్లు అతడి వద్ద ఉన్నట్టు గుర్తించారు పోలీసులు. అలాగే పోర్న్ వీడియోలతో కూడిన 60 జీబీ మెమోరీని స్వాధీనం చేసుకున్నారు.

porn watch ladies

ఖలీద్ చర్యలను బయటపెట్టాలని చాలామంది మహిళలు భావించినప్పటికీ ఎక్కడ పరువు పోతుందోనని భయపడి చాలామంది వెనుకడుగేయడంతో ఖలీద్ మరింతగా రెచ్చిపోయాడు. అయితే ఎట్టకేలకు కొంతమంది మహిళలు ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించడంతో ఖలీద్ ఆగడాలకు ఫుల్ స్టాప్ పడింది.

అదే కారణం :

అయితే.. ఖలీద్ ఈ పోర్న్ వీడియోలను పంపించడం వెనుక ఉన్న అసలు కోణాన్ని చేధించారు. ఖలీద్ నుంచి నిజాలను రాబట్టిన పోలీసులకు తెలిసిందేంటంటే.. కేవలం 4 అడుగుల 10 అంగుళాల ఉండే తనను ప్రేమించడానికి అమ్మాయిలెవరు ఇష్టపడకపోవడంతో, అందమైన అమ్మాయిలందరి మీద ద్వేషం పెంచుకున్న ఖలీద్ ఈ చర్యలకు పాల్పడ్డాడు. ఖలీద్ చెప్పిన కారణం విని పోలీసులే షాక్ తిన్నట్టు తెలుస్తోంది.

సరైన కుటుంబ పాలన లేని నేపథ్యం కూడా ఖలీద్ ఈవిధంగా మారడానికి మరో కారణమన్నారు పోలీసులు. ప్రస్తుతం అతడికి కౌన్సెలింగ్ నిర్వహించే ప్రయత్నాల్లో ఉన్న పోలీసులు, ఆ తర్వాత కేసుకు సంబంధించిన విచారణను చేపట్టనున్నారు.

English summary
Delhi police arrested a man for harassing over 1,500 women by sending them pornographic content, including x-rated videos and obscene photos almost every night
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X