వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ ట్రాఫిక్ పోలీసు..!! హర్లే డెవిడ్‌సన్‌ బైక్ మ్యూజిక్‌పై కూడా ఫైన్.. గన్నీ బ్యాగుల పేరుతో...

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : కొత్త మోటారు వాహన చట్టం అస్త్రాన్ని పోలీసులు ఎడా పెడా వాడుతున్నారు. చిత్ర, విచిత్ర కారణాలు చెపుతూ చలాన్ వేస్తున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో ట్రాఫిక్ పోలీసులు ఓ వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. అందుకు గల కారణం ఏం చెప్పారో తెలుసా .. బండి మీద మ్యూజిక్ పెట్టుకున్నారని పేర్కొన్నారు. వాస్తవానికి అదీ ఇన్‌బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ అయినా .. చేయించారని చలానా వేసి ముక్కుపిండి వసూల్ చేశారు. పోలీసుల చర్యను తప్పుపడుతూ సోషల్ మీడియా ఫేస్‌బుక్‌లో రాసుకొచ్చారు సదరు యువకుడు.

ఇటీవల ఢిల్లీ తిలక్ నగర్ వద్ద నుంచి రాఘవ్ అనే యువకుడు తన కొత్త హర్లే డెవిడ్‌సన్ బైక్‌తో వస్తున్నాడు. ఆ టూవీలర్‌ను ఇటీవలే కొనుగోలు చేశాడు రాఘవ్. దానికి మ్యూజిక్ సిస్టమ్, పక్కల జీన్స్ బ్యాగులు కూడా ఉన్నాయి. రాఘవ్‌ను ఆపిన పోలీసులు .. స్టేషన్ తీసుకెళ్లారు. ఎందుకు తీసుకెళ్లారంటే చెప్పారు. తర్వాత మ్యూజిక్ సిస్టం ఉందని చెప్పారు. అదీ తన బైక్‌తో వచ్చిందని చెబితే వినిపించుకోరు. అప్పటికే తాను 30 శాతం సౌండ్ పెట్టుకొని వస్తుండగా .. 100 శాతం సౌండ్ పెట్టి వీడియో తీశారు. టూ వీలర్‌కు గన్నీ బ్యాగులు ఉన్నాయని మెలిక పెట్టారు. అవీ వాహనంతో వచ్చాయని చెప్పినా వినిపించుకోలేదు. వీడియో తీసి .. తమ జులుం ప్రదర్శించారు.

Delhi man says he was fined for playing music on Harley-Davidson bike

తన వాదనను ఏసీపీ, ఎస్సై వినిపించుకోలేదని రాఘవ్ వాపోయారు. ఎంత చెప్పిన వినిపించుకోకుండా .. ఫైన్ చేశారు. వారు చెప్పిన కారణం ఏంటో తెలుసా ... మీరు వాహనంపై మ్యూజిక్ వినడమేనని చెప్పడంతో ... తనకు జరిగిన ఘటనను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. ఆ పోస్టుకు నెటిజన్లు స్పందిస్తున్నారు. పోలీసుల తీరును తప్పుబడుతున్నారు. ఇప్పటికే 200 సార్లు షేర్ చేయగా .. 350 లైకులు వచ్చాయి.

English summary
a man was fined by the police in New Delhi for playing music on his Harley-Davidson motorcycle as he wrote about the incident at length on Facebook. Raghav Swati Pruthi recently bought a Harley-Davidson Road Glide Special that has a factory fit audio system. In his post, Raghav said that he was riding near Tilak Nagar and was stopped by the police, who also asked him for his license.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X