వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీ మహిళల రక్షణ... మెట్రో మరియు బస్సుల్లో ఉచిత ప్రయాణం.. అరవింద్ కేజ్రీవాల్ ప్రకటన

|
Google Oneindia TeluguNews

ఢిల్లీలో మహిళల సేఫ్ జర్నీకి ఆప్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈనేపథ్యంలోనే ఢిల్లీలోని మెట్రో ట్రైన్‌తో పాటు లోకల్ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రకటించారు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఈ ఉచిత ప్రయాణానికి సంబంధించి ఇప్పటికే ఢిల్లి మెట్రో అధికారులతో చర్చించినట్టు ఆయన తెలిపారు. కాగా దీనిపై వారం రోజుల్లో నివేదిక ఇవ్వాలని అధికారులను కోరారు ముఖ్యమంత్రి కేజ్రీవాల్. అయితే ఇది ఆచరణలోకి వచ్చే సరికి రెండు నుండి మూడు నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు.

ఇక మెట్రో చార్జీలకు సంబంధించి ప్రజలపై ఎలాంటీ భారం వెయమని ఆయన తెలిపారు. కాగా ఉచిత ప్రయాణానికి సంబంధించి ప్రభుత్వమే భరిస్తుందని ఆయన ప్రకటించారు. అయితే ఢీల్లీ మెట్రో రైల్లో కేంద్ర రాష్ట్ర్ర ప్రభుత్వాలు 50 :50 షేర్ ఉందని తెలిపారు. కాగా సబ్సీడీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపామని కాని కేంద్రం సబ్సిడిపై స్పందించలేదని అన్నారు.

Delhi Metro and DTC bus rides for women for free

మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి డిల్లీ రవాణ శాఖ మంత్రి కైలాష్ గహ్లోత్ డిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.మరోవైపు ఢిల్లి మెట్రోలో కేంద్ర, రాష్ట్ర్ర ప్రభుత్వాలకు 50 శాతం చొప్పున వాటాలు ఉన్న ఈనేపథ్యంలోనే మెట్రోపై పూర్తి అధికారం గనుక రాష్ఠ్ట్ర్ర ప్రభుత్వానికి సక్రమించినట్లయితే చార్జీల్లో 30 శాతం మేర తగ్గిస్తామని అప్ ఢిల్లి డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా గతంలోనే ప్రకటించారు.

కాగా మరో ఆరు నెలల్లో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల్లో లబ్ధిపోందేందుకు ఇప్పటి నుండే అరవింద్ కేజ్రీవాల్ ఓట్ల కోసం పావులు కదుపుతున్నారు. ఇక గడచిన పార్లమెంట్ ఎన్నికల్లో ఆప్ హర్యాన ఢిల్లీతోపాటు మొత్తం 40 స్థానాల్లో పోటీ చేస్తే కేవలం ఒక్క స్థానంలో గెలుపోందింది. కాగా ఢిల్లీలోని ఏడు స్థానాలను కూడ బీజేపీ కైవసం చేసుకుంది. దీంతో కేజ్రీవాల్ రెండవ సారి ప్రభుత్వంలోకి వచ్చేందుకు ఇప్పటి నుండే స్కేచ్ వేస్తున్నారు.

English summary
with Assembly polls due early next year in the city, Delhi Chief Minister Arvind Kejriwal has announced free Delhi Metro and DTC bus rides for women in the capital city.Arvind Kejriwal said that the scheme to provide free Delhi Metro and DTC rides has been announced so that women have safe travel experience in Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X