వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తుపాకీతో కాల్చుకుని ఢిల్లీ మెట్రో సెక్యూరిటీ అధికారి ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ సెక్యూరిటీగా ఉన్న ఓ సిఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతని వద్ద ఉన్న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని గురువారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సిఐఎస్ఎఫ్) కానిస్టేబుల్ ముకేష్ కుమార్(40) గురువారం ఉదయం 3గంటల ప్రాంతంలో తనకు తానే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలిపారు. విధుల్లో ఉండగానే అతడు ఈ ఘటనకు పూనుకున్నాడని చెప్పారు.

Delhi Metro security personnel shoots self

గమనించిన ఇతర సిబ్బంది అతడ్ని సమీపంలోని లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. సీనియర్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారని చెప్పారు.

ఘర్షణ: ఇంజినీరింగ్ విద్యార్థి మృతి

కోయంబత్తూరు: తమిళనాడులోని కర్పగమ్ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఓ విద్యార్థి మృతి చెందాడు. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మృతుడు కార్తికేయన్ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణలో పాల్గొనలేదు. అయితే తన స్నేహితుడిని గొడవ నుంచి పక్కకు తీసుకురావడానికి ప్రయత్నించగా.. ప్రత్యర్థులు కార్తికేయన్‌పై కర్రలు, ఇను రాడ్లతో దాడి చేశారు.

తీవ్రంగా గాయపడిన కార్తికేయన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం సాయంత్రం జరిగిన ఈ ఘర్షనలో తీవ్రంగా గాయపడిన కార్తికేయన్.. బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. మద్యం మత్తులో ఉన్న విద్యార్థులు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

English summary
A CISF constable deployed on Delhi Metro's airport express line committed suicide early on Thursday by shooting himself with his service rifle, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X