వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పొట్టి డ్రెస్‌లు వేసుకున్న అమ్మాయిలను రేప్ చెయ్యండి.. బహిరంగ ప్రకటన చేసి చిక్కుల్లో పడ్డ ఆంటీ!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ: చిన్న గౌను వేసుకున్న పెద్దపాపా... నీ చిన్ననాటి ముద్దు పేరు లాలి పాప్పా... అంటూ ఓ సినీ కవి పొట్టి డ్రస్సులు వేసుకుంటున్న పాపలపై ఓ సెటైరికల్ సాంగ్ అందుకున్నారు. భారత సంస్కృతి ప్రకారం స్త్రీ వస్త్రధారణ ఎలా ఉంటే చూడముచ్చటగా ఉంటుందో ఇప్పటికీ చాలామంది పెద్దలు వివరిస్తారు. పాశ్చాత్య దేశాలకు చెందిన మహిళలు భారత సంస్కృతిని, వస్త్రధారణను ఇష్టపడి వారు మన దుస్తులను ధరించుకుంటుంటే... మన దేశంలో కొందరు అమ్మాయిలు మాత్రం పాశ్చాత్య దేశపు వస్త్రధారణతోనే కంఫర్ట్‌బుల్‌గా ఉన్నామంటున్నారు. ఇలా వస్త్రధారణతో బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్నారు. దీంతో అమ్మాయిలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. ఇక ఇదంతా ఎందుకు చెబుతున్నామనుకుంటున్నారా...? ఢిల్లీలో ఓ మధ్యవయస్కురాలైన మహిళ అమ్మాయిలపై అత్యాచారం చేయండి అంటూ యువకులకు పిలుపు ఇస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాను చుట్టేస్తోంది. ఆ మహిళ ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేసిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

పొట్టి డ్రెస్సులు ధరించిన అమ్మాయిలపై అత్యాచారం చేయండి

పొట్టి డ్రెస్సులు ధరించిన అమ్మాయిలపై అత్యాచారం చేయండి

భారతదేశం.. ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. మన సంస్కృతీ ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తుంది. ఎంత ఘన చరిత్ర ఉన్నప్పటికీ అంతే స్థాయిలో నేరాలు జరుగుతున్నాయి. ఇక ప్రత్యేకించి చెప్పాలంటే అమ్మాయిలపై అత్యాచారాలు ఎన్నో జరుగుతున్న వార్తలు రోజు చదువుతూనే ఉన్నాం. అమ్మాయిలపై అత్యాచారాలు కచ్చితంగా ఖండించాల్సిన విషయమే... కానీ కొందరు అమ్మాయిలు ధరించే వస్త్రధారణ, పొట్టి పొట్టి డ్రస్సులు కూడా ఈ అత్యాచారాలకు దారితీస్తున్నాయనేది కొందరి వాదన. తాజాగా ఢిల్లీలో ఓ మహిళ అమ్మాయిలపై అత్యాచారం చేయండి అంటూ యువకులకు పిలుపు నిచ్చింది. ఆ వీడియో సోషల్ మీడియాను చుట్టేస్తోంది.

ఇలాంటి దుస్తులు ధరిస్తే రేప్ కాక ఇంకేం చేస్తారు..?

పొట్టి పొట్టి డ్రస్సులు, శరీరం కనిపించీ కనిపించకుండే ధరించే దుస్తులు వేసుకొన్న కొందరి అమ్మాయిలపై ఓ మహిళ సీరియస్‌ అయ్యింది. ఇలాంటి డ్రస్సులు వేసుకుంటే అబ్బాయిలూ రేప్ చేయకుండా ఇంకేం చేస్తారు అంటూ గట్టిగా బుద్ది చెప్పే ప్రయత్నం చేసింది. ఆ అమ్మాయిలు ఈ మహిళతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత ఈ మహిళ ఓ రెస్టారెంట్‌లో కూర్చున్న యువకుల దగ్గరకు వెళ్లి పొట్టి డ్రస్సులు వేసుకునే అమ్మాయిలను రేప్ చేయండి అంటూ గట్టిగా అరిచి చెప్పింది. ఈ మహిళ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఆగ్రహం చెందిన అమ్మాయిలూ ఆమెను ఫాలో అవుతూ ఓ షాపింగ్ స్టోర్‌లోకి వెళ్లారు. ఆమె మానసిక పరిస్థితి ఎలాగుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు.

మీ ఇష్టమొచ్చినట్లు చేస్కోండి.. నేను క్షమాపణ చెప్పను

మీ ఇష్టమొచ్చినట్లు చేస్కోండి.. నేను క్షమాపణ చెప్పను

మహిళ చేసిన వ్యాఖ్యలకు ఆమె క్షమాపణ చెప్పాల్సిందిగా పదేపదే ఒత్తిడి తీసుకొచ్చారు అమ్మాయిలు. కానీ తాను మాత్రం క్షమాపణ చెప్పేందుకు నిరాకరించింది. అమ్మాయిలూ అప్పటికీ ఆమెను వదల్లేదు. ఆమె వెంటే వెళ్లారు. వారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఆ మహిళ.ఇక చేసేది ఏమీ లేక స్టోర్ సిబ్బందికి చెప్పి పోలీసులను పిలవాల్సిందిగా కోరింది. "పొట్టి పొట్టి డ్రస్సులు వేసుకున్నవారికి నేను క్షమాపణ చెప్పాలా.. వారికెంత ధైర్యం" అని కేకలు వేసింది మహిళ. మొత్తం రికార్డు చేశామని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని మహిళను బెదిరించే ప్రయత్నం చేశారు అమ్మాయిలు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి తను మాత్రం క్షమాపణ చెప్పనని తెగేసి చెప్పేసింది ఆ మహిళ.

 సైకోలు మాత్రమే వారిపై అత్యాచారం చేస్తారు

సైకోలు మాత్రమే వారిపై అత్యాచారం చేస్తారు

అమ్మాయిలు తమకు ఇష్టం వచ్చిన దుస్తులు ధరిస్తారని అయినా నిండుగా కప్పుకున్న వారు కూడా అత్యాచారానికి గురవుతున్నారు కదా అని ఓ అమ్మాయి ప్రశ్నించింది. అలాంటి వారిని రేప్ చేసేవారు సైకోలు అయి ఉంటారని ఈ మహిళ సమాధానం ఇచ్చింది. మొత్తం భారత దేశంలోని ప్రజలంతా తన మాట వినాల్సిందిగా ఆ మహిళ విజ్ఞప్తి చేస్తున్నట్లు వీడియోలో ఉంది. ఈ వీడియో సోషల్ మీడియాలో పోస్టు అవగానే ఇన్స్‌టాగ్రామ్‌లో 1 మిలియన్ వ్యూస్ రాగా... ఫేస్‌బుక్‌లో 32వేల మంది వీక్షించారు.

English summary
A delhi aunty asks young men to rape woman who wear short dresses. This video goes viral on social media where a group of young women demanding an apology from the old woman who commented on their dresses.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X