వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అలర్ట్.. అలర్ట్... మరో 48 గంటలు ఢిల్లీలో హై అలర్ట్.. ఐబీ హెచ్చరికలతో భద్రతా సంస్థలు అప్రమత్తం..

|
Google Oneindia TeluguNews

మరో 48 గంటల్లో జమ్ముకశ్మీర్ రెండు కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. జమ్ముకశ్మీర్ విభజన బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపగా.. గెజిట్ కూడా వెలువడిన సంగతి తెలిసిందే. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఈ నెల 31వ తేదీన జమ్ముకశ్మీర్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న పాకిస్థాన్, ఉగ్రవాదులు దాడులకు తెగబడే అవకాశం ఉందని నిఘావర్గాలు హెచ్చరిస్తున్నాయి.

31వ తేదీన విభజన..

31వ తేదీన విభజన..

31వ తేదీన జమ్ముకశ్మీర్.. కశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత ప్రాంతాలుగా విడిపోనుంది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న ముష్కరులు దాడులకు తెగబడే అవకాశం ఉంది. ఈ మేరకు నిఘావర్గాలు హెచ్చరికలు జారీచేశాయి. దేశ రాజధాని ఢిల్లీ లక్ష్యంగా దాడులు చేసే ఛాన్స్ ఉందని హెచ్చరించడంతో మరో 48 గంటలు హై అలర్ట్ విధించారు. రాజధాని ప్రాంతాన్ని పోలీసులు ఇప్పటికే జల్లెడపట్టారు. అణువణువూ పరిశీలిస్తున్నారు.

హిట్‌లిస్ట్‌లో ఢిల్లీ

హిట్‌లిస్ట్‌లో ఢిల్లీ

ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఢిల్లీ ఎప్పటినుంచో ఉంది. కశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తున్న కొందరు దాడులకు తెగబడే ప్రయత్నం చేస్తారని విశ్వసనీయంగా తెలిసింది. ఐబీ.. భద్రతా విభాగాలను అలర్ట్ చేశాయి. దీంతో పోలీసులు దేశ రాజధానిని జల్లెడ పడుతున్నారు. ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చిన.. తనిఖీ చేస్తున్నారు. కశ్మీర్ విభజన తర్వాత ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. కశ్మీర్‌లోనే దాదాపు 40 వేలకు పైగా సీఆర్పీఎఫ్ బలగాలను మొహరించారు. ఇప్పటికీ కూడా ఆంక్షలు అమల్లో ఉండటంతో జనం బయటకు రాని పరిస్థితి ఏర్పడింది.

కారణమిదీ..?

కారణమిదీ..?

కశ్మీర్ విభజనను నిరసిస్తూ ఢిల్లీ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులు చేయొచ్చని నిఘావర్గాలు హెచ్చరించాయి. మారుతున్న పరిణామాలతో సోమవారం ఢిల్లీలో హై లెవల్ మీటింగ్ జరిగింది. అన్ని భద్రతా సంస్థలను ఐబీ హెచ్చరించిన సంగతి తెలిసిందే. దీంతో 31వ తేదీన బీభత్సం సృష్టించే అవకాశం ఉందని భావించి అప్రమత్తం చేసింది.

విలీనం

విలీనం

ఆర్టికల్ 370 రద్దుచేసి.. జమ్ముకశ్మీర్‌ను నరేంద్ర మోడీ ప్రభుత్వం విభజించిన సంగతి తెలిసిందే. ఆగస్ట్ 5వ తేదీని కశ్మీర్ విభజన ప్రక్రియ పూర్తయింది. గెజిట్ విడుదలైన.. జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలుగా ఈ నెల 31వ తేదీ నుంచి మనుగడలోకి వస్తాయి. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా గురువారాన్ని కేంద్ర నిర్ణయించింది. అఖండ భారతంలో ఉన్న సంస్థానాలను పటేల్ విలీనం చేసిన సంగతి తెలిసిందే. ఆయన సేవలకు గుర్తుగా పటేల్‌ జయంతి సందర్భంగా కశ్మీర్, లడాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు అమల్లోకి రానున్నాయి.

English summary
delhi is high alert for the next 48 hours after security agencies received inputs of a possible act of terror ahead of J&K bifurcation on October 31.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X