వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా లాక్ డౌన్ దారుణం- జీతం కోతపై యజమానితో గొడవ - పీక కోసి బావిలో పడేసిన ఉద్యోగి

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారి కారణంగా కొనసాగుతోన్న లాక్ డౌన్ దాదాపు అందరి జీవితాలనూ ప్రభావితం చేసింది. శాలరీడ్ వర్గంలోనే సుమారు కోటి మంది ఉద్యోగాలు కోల్పోగా, అసంఘటిత రంగమైతే అతలాకుతలమైపోయింది. ఉద్యోగాల్లో ఉన్నోళ్లకూ జీతం కోతలు తప్పడంలేదు. బతికుంటే బలుసాకు తినొచ్చని అందరూ అడ్జెస్ట్ అయిపోతున్న వేళ కొందరు మాత్రం క్రైమ్ బాటపడుతున్నారు. జీతం కోతంలో కోత పెట్టాడన్న కోపంతో ఓ చిరుద్యోగి తన యజమానిని దారుణంగా హతమార్చిన సంఘటన దేశరాజధానిలో కలకలం రేపింది.

షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్షాకింగ్: చైనా యుద్ధ విన్యాసాలు రద్దు - పైనుంచి యూఎస్-2 రాకతో కలకలం- ఉల్లంఘనపై డ్రాగన్ ఫైర్

అనూహ్యం: గాల్వాన్‌పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్‌పై అక్కసుఅనూహ్యం: గాల్వాన్‌పై చైనా పశ్చాత్తాపం - హింస దురదృష్టకరమన్న రాయబారి వీడాంగ్ - ఆత్మనిర్భర్‌పై అక్కసు

 జీతం నెలకు రూ.15వేలు..

జీతం నెలకు రూ.15వేలు..

ఢిల్లీలోని జగ్గార్ జిల్లా బాబా హద్రీస్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓం ప్రకాశ్(45) అనే వ్యక్తి డైరీ ఫాం నిర్వహించేవాడు. అక్కడ సహాయకుడిగా పనిచేయడానికి ఓ వ్యక్తి అవసరంకాగా, తెలిసినవాళ్ల ద్వారా తస్లీమ్(21) అనే యువకుణ్ని పనిలోకి తీసుకున్నాడు. ఉత్తరప్రదేశ్ లోని షామ్లీకి చెందిన తస్లీమ్ గతంలో ఓ రెస్టారెంట్ లో పనిచేసేవాడు. ఓం ప్రకాష్ దగ్గర నెలకు రూ.15వేల జీతానికి కుదిరాడు. తీరా జీతం తీసుకునే సమయంలో ఇద్దరి మధ్య గొడవ తలెత్తింది.

 జీతం కోత.. చెంపదెబ్బ..

జీతం కోత.. చెంపదెబ్బ..

ఓం ప్రకాశ్ డైరీ ఫాంలో పనికి జులైలో చేరిన తస్లీమ్.. ఈ నెల మొదటి వారంలో జీతం అడిగాడు. అయితే, ముందే అనుకున్న విధంగా రూ.15వేలు కాకుండా, దాదాపు సగం జీతం కోటపెట్టి ఇవ్వడంతో అతను డంగయ్యాడు. కరోనా లాక్ డౌన్ కారణంగా బిజినెస్ బాగా దెబ్బతినిందని, ప్రస్తుతానికి ఈ అమౌంట్ తోనే సరిపెట్టుకోవాలని యజమాని నచ్చచెప్పడానికి ప్రయత్నించినా తస్లీమ్ వినిపించుకోలేదు. దీంతో కోపోద్రిక్తుడైన ఓం ప్రకాశ్.. పనివాడిపై చేయిచేసుకుని, అక్కణ్నుంచి వెళ్లగొట్టాడు. ఆ తర్వాత..

పీక కోసి.. గోనె సంచిలో కుక్కి..

పీక కోసి.. గోనె సంచిలో కుక్కి..

జీతం కోత పెట్టిందే కాకుండా, చెంప దెబ్బ కొట్టాడని యజమానిపై కక్ష పెంచుకున్న తస్లీమ్ ఈనెల 10న అర్ధరాత్రి డైరీ ఫాంకు వెళ్లి, అక్కడ నిద్రిస్తోన్న ఓం ప్రకాశ్ పై దాడి చేశాడు. ముందుగా కర్రతో ప్రకాశ్ తలపై బలంగా మోదాడు, అతను స్పృహకోల్పోగానే, వెంట తెచ్చుకున్న కత్తితో పీక కోసేశాడు. ఆ తర్వాత శవాన్ని ఓ గోనె సంచిలో కుక్కి, దగ్గర్లోని పాడుబడ్డ బావిలో విసిరేశాడు. అనంతరం ఓం ప్రకాశ్ బైక్, రెండు మొబైళ్లు తీసుకుని తస్లీమ్ పరారయ్యాడు.

సుదీర్ఘ వేట.. ఎట్టకేలకు అరెస్ట్

సుదీర్ఘ వేట.. ఎట్టకేలకు అరెస్ట్

తన బావ కనిపించకుండా పోయాడంటూ ఓం ప్రకాశ్ బావమరిది ఈనెల 12న బాబా హద్రీస్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా అతణ్ని తస్లీమ్ తో కలిసుండగా చూశానని చెప్పడంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేపట్టారు. ఈలోపు బావిలోని మృతదేహం కుళ్లిపోయి వాసన రావడంతో వెలికితీయగా, అది ప్రకాశేనని నిర్ధారణ అయింది. ఆ తర్వాత హత్య కేసు నమోదు చేసిన పోలీసులు. తస్లీమ్ కోసం గాలింపు చేపట్టారు. ఢిల్లీలో అతను నివసించిన ప్రాంతాలతోపాటు సొంతూరు షామ్లీ, బంధువుల ఊరు పానిపట్ తదితర ప్రాంతాల్లో గాలించారు. సుదీర్ఘ గాలింపు తర్వాత, ఈ నెల 23న ఝరోడా కాలన్ ప్రాంతంలో సంచరిస్తోన్న తస్లీమ్ ను పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. తమదైన శైలిలో విచారించగా జీతం కోతకు తోడు యజమాని కొట్టడం వల్లే హత్య చేశానని తస్లీమ్ అంగీకరించాడు. దీంతో అతణ్ని రిమాండ్ కు తరలించారు.

చెంపలేసుకున్న శ్రీలంక - చైనాతో ఒప్పందం భారీ తప్పిదం - ఇకపై 'ఇండియా ఫస్ట్' పాలసీ -నమ్మొచ్చా?చెంపలేసుకున్న శ్రీలంక - చైనాతో ఒప్పందం భారీ తప్పిదం - ఇకపై 'ఇండియా ఫస్ట్' పాలసీ -నమ్మొచ్చా?

English summary
Delhi Police arrested a 21-year-old Tasleem from west Delhi's Jharoda Kalan area for allegedly killing his employer, who had slapped him during an argument over salary reduction as his business was severely hit due to the coronavirus pandemic. Police said that the accused, Tasleem, who worked as servant at a dairy owned by 45-year-old Om Prakash, hit his employer on the head with a wooden stick, slit his neck with a knife, put it in a gunny bag and threw it in a well nearby.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X