వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మాయిలను చూస్తూ హస్త ప్రయోగం చేసిన పోకిరీల గుర్తింపు, పది మంది అరెస్ట్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ గార్గి కాలేజీలో అమ్మాయిలను చూస్తూ హస్తప్రయోగం చేసిన కేసులో పోలీసులు 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. గురువారం జరిగిన ఆన్యువల్ డేలో భాగంగా అల్లరిమూకలు విద్యార్థినులను చూస్తూ హస్తప్రయోగం చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పష్టంచేశారు. ఈ మేరకు పోలీసులు చర్యలు తీసుకున్నారు.

10 మంది అరెస్ట్..

10 మంది అరెస్ట్..

ఘటనపై పోలీసులు ఐపీసీ 452, 354, 509, 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. హౌజ్ ఖాన్ పోలీసులు 11 బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుల కోసం గాలించారు. సాంకేతిక అంశాల ఆధారంగా నిందితులను గుర్తించారు. దేశ రాజధాని పరిసరాలకు చెందిన 10 మందిని గుర్తించారు. అనుమానం వచ్చిన ప్రతీ ఒక్కరిని ప్రశ్నించారు. మరోవైపు కాలేజీ సిబ్బందిని కూడా విచారణ బృందం ప్రశ్నించింది.

35 మంది అల్లరిమూకలు..

35 మంది అల్లరిమూకలు..

గురువారం రాత్రి క్యాంపస్‌లోకి చొరబడ్డ దాదాపు 30-35 మంది మూక విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అమ్మాయిల వైపు చూస్తూ హస్త ప్రయోగానికి పాల్పడ్డారు. క్యాంపస్‌లో వారిని వెంబడించి దాడికి పాల్పడ్డారు. వారంతా మద్యం మత్తులో ఉన్నారని విద్యార్థినులు చెబుతున్నారు. కాలేజీ యాజమాన్యం సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే వారు క్యాంపస్ లోపలికి ప్రవేశించారని ఆరోపించారు.

కేజ్రీ సీరియస్..

కేజ్రీ సీరియస్..


గార్గి ఘటనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. మన బిడ్డలపై ఇలాంటి ఆకృత్యాలకు పాల్పడ్డవారికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు. కాలేజీల్లో విద్యార్థినులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత మనపై ఉందని గుర్తుచేశారు. మహిళా భద్రతపై ఇటీవల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ కేజ్రీవాల్ పలు హామీలు ఇచ్చిన సంగతి తెలిసిందే.

English summary
Delhi Police on Wednesday arrested ten students in connection with the alleged molestation of girls in Gargi college.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X