వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్మోహన్ సలహాదారుకే బురిడీ- ఆన్ లైన్ మోసంతో బాధితుడైన ఆర్ధికవేత్త అడ్వైజర్...

|
Google Oneindia TeluguNews

మాజీ ప్రధాని, మాజీ ఆర్ధికమంత్రి, ఆర్ధికవేత్త మన్మోహన్ సింగ్ కు సలహాదారుగా వ్యవహరించిన సంజయ్ బారు... ఓ చిన్న ఆన్ లైన్ మోసానికి బాథితుడిగా మారాడంటే నమ్మగలమా ? అంతటి ఆర్ధికవేత్తకే సలహాదారుగా పనిచేసిన వ్యక్తి తాజాగా ఆన్ లైన్లో మద్యం ఆర్డర్ చేయబోయి మోసపోయారు. ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి నిందితుడిని పట్టుకోగలిగారు. అసలేం జరిగిందంటే..

లాక్ డౌన్ కష్టాలు.. ఆన్ లైన్ మద్యం..

లాక్ డౌన్ కష్టాలు.. ఆన్ లైన్ మద్యం..

ఒకప్పుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు మీడియా సలహాదారుగా పనిచేసిన సంజయ్ బారు తెలుగు వారే. ఢిల్లీ సర్కిళ్లలో మంచి పేరు ప్రతిష్టలున్న వారే. తెలుగువారందరికీ సుపరిచితులే. ప్రధాన మంత్రిగా సలహాదారుగా పనిచేసిన సంజయ్ తాజాగా ఓ చిన్న విషయంలో మోస పోవడం సంచలనం రేపింది. ఢిల్లీలో కరోనా వ్యాప్తి కారణంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో ఆయన మద్యం కోసం ఆన్ లైన్ లో వెతికారు. చివరికి లా కేవ్ వైన్స్ అండ్ స్పిరిట్స్ పేరుతో ఓ షాపులో మద్యం దొరుకుతున్నట్లు ఓ ఆన్ లైన్ సైట్లో కనిపించడంతో మద్యం కావాలంటూ ఆర్డర్ పెట్టారు. అందుకోసం ఏకంగా రూ.24 వేల రూపాయలు చెల్లించారు.

డబ్బు చెల్లించాక ఫోన్ స్విచాఫ్...

డబ్బు చెల్లించాక ఫోన్ స్విచాఫ్...

ఆన్ లైన్ లో మద్యం కోసం రూ.24 వేలు చెల్లించాలని సంజయ్ బారును కోరిన అవతల వ్యక్తి డబ్బులు ట్రాన్స్ ఫర్ కాగానే సెల్ స్విచాఫ్ చేసేశాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచాఫ్ రావడంతో సంజయ్ బారు ఢిల్లీ పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. సంజయ్ నుంచి ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు మొబైల్ నంబరును ట్రేస్ చేశారు. చివరికి అది ఓ క్యాబ్ డ్రైవర్ ది అని తేలింది. అతని అరెస్టు చేసి విచారించగా ఢిల్లీ పోలీసులకు దిమ్మతిరిగే వాస్తవాలు తెలిశాయి. లాక్ డౌన్ లో జరుగుతున్న ఎన్నో మోసాలు బయటపడ్డాయి.

ఢిల్లీ సర్కిళ్లలో విస్తృత చర్చ..

ఢిల్లీ సర్కిళ్లలో విస్తృత చర్చ..

ఈ వ్యవహారంలో మోసం చేసిన వ్యక్తి కంటే సంజయ్ బారు గురించే ఢిల్లీ సర్కిళ్లలో చర్చ సాగుతోంది. అంతటి ఆర్దికవేత్తకు సలహాదారుగా పనిచేసిన వ్యక్తి, ఉన్నత కుటుంబానికి చెందిన వ్యక్తి ఇలా వివరాలేమీ తెలుసుకోకుండా మద్యం కోసం రూ.24 వేలు చెల్లించి అలా ఎలా మోసపోయారంటూ ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. సంజయ్ తండ్రి విఠల్ తాజాగా కన్నుమూశారు. ఆ డిప్రెషన్ లో ఉన్నందున మద్యం కోసం హడావిడిగా ప్రయత్నించిన సందర్భంగా సంజయ్ ఇలా మోసపోయి ఉండొచ్చని మరికొందరు చెబుతున్నారు. ఏదేమైనా వీఐపీ స్దాయిలో ఉన్న వ్యక్తి చిన్న మోసానికి గురి కావడానికి లాక్ డౌన్ కూడా కారణంగా నిలిచింది.

English summary
sanjay baru, ex media advisor of former prime minister manmohan singh have been cheated recently while ordering liquor online in delhi. a cab driver cheated him in online for rs.24000. delhi police arrested him and lodged case also.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X