వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూ ఘటన విచారణ , ‘ఇండియా టుడే’ను ఆడియో టేపులు అడిగిన ఢిల్లీ పోలీసులు

|
Google Oneindia TeluguNews

జేఎన్‌యూలో దాడికి సంబంధించి 'ఇండియా టుడే చేసిన స్టింగ్ ఆపరేషన్' పెను దుమారం రేపింది. ఏబీవీపీ, వామపక్ష విద్యార్థుల ప్రమేయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వీడియోలు, ఆడియో టేపులు పోలీసుల విచారణకు కూడా సహకారం అందిస్తుండటం విశేషం. జేఎన్‌యూ ఘటనకు సంబంధించి ఆడియో టేపులను ఇవ్వాలని మీడియా సంస్థను పోలీసులు అడగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Delhi Police asks for jnu Tapes for investigation

ఆదివారం జరిగిన ఘటనల గురించి 'ఇండియా టుడే' నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ సంచలనం సృష్టించింది. మొదటి టేపుల్లో ఏబీవీపీకి చెందిన అక్షత్ అవస్తీ, రెండో టేపులో ఏబీవీపీకి చెందిన రోహిత్ షా, మూడో టేపులో వామపక్షాలకు చెందిన విద్యార్థి గీతా కుమారి గురించి స్టింగ్ ఆపరేషనల్ ఇండియా టుడే రిపోర్టర్ బహిర్గతం చేసిన సంగతి తెలిసిందే.

పార్ట్-2 అంటూ మరో వీడియోను 'ఇండియా టుడే' శనివారం సాయంత్రం విడుదల చేసింది. ఇందులో ఏబీవీపీకి చెందిన మరో విద్యార్థిని కోమల్ శర్మ ఉన్నారని స్టింగ్ ఆపరేషన్‌లో పేర్కొన్నది. ఆమె జేఎన్‌యూలో చదువుతోన్నారని, ఏబీవీపీ కార్యకర్త అని వివరించింది. వీడియోలో మొహానికి మాస్క్ వేసుకున్న ఫోటోలు, చేతిలో కర్ర పెట్టుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతోన్నాయి. ఆడియో టేపులు కూడా ట్రోల్ అవడంతో.. కోమల్ శర్మ తన ఉనికిని తెలియజేయొద్దని సీనియర్లను వేడుకుంటున్న ఆడియోలు కూడా బహిర్గతమవుతోన్నాయి. అయితే ఆమె కోమల్ శర్మ అని జేఎన్‌యూలో సీనియర్ విద్యార్థి ఒకరు 'ఇండియా టుడే' రిపోర్టర్‌కు తెలియజేశారు.

English summary
Delhi Police has asked India Today for the confession tapes for investigation in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X