వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ట్రాఫిక్ చలాన్లు రద్దు.. కండిషన్స్ అప్లై..!

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ట్రాఫిక్ చలాన్లు రద్దు చేసేలా ఢిల్లీ పోలీసులు రెడీ అయ్యారు. పరిమిత కాలానికి సంబంధించి దాదాపు లక్షా యాభై వేల చలాన్లు వెనక్కి తీసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆగస్టు ఒకటవ తేదీ నుంచి అక్టోబర్ 10వ తేదీ మధ్య 24వ నెంబర్ జాతీయ రహదారిపై వేసిన ట్రాఫిక్ చలాన్లు రద్దు చేయాలని నిర్ణయించారు. అధిక వేగంతో ప్రయాణించిన వాహనాలకు సంబంధించి వేసిన చలాన్లలో తప్పులు దొర్లినట్లు గుర్తించారట. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే పరిమిత కాలానికి సంబంధించి ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలు సదరు వాహన దారులకు తిరిగి చెల్లిస్తారా లేదా అనేదానిపై క్లారిటీ లేకుండా పోయింది.

24వ నెంబర్ జాతీయ రహదారిపై ఓవర్ స్పీడ్ కారణంగా ఈ రెండున్నర నెలల్లో లక్షన్నర మేరకు చలాన్లు విధించినట్లు జాయింట్ కమిషనర్ స్థాయి ట్రాఫిక్ పోలీస్ అధికారి వెల్లడించారు. ఢిల్లీ - యూపీ సరిహద్దులోని నిజాముద్దీన్ బ్రిడ్జి నుంచి ఘాజీపూర్ మధ్య స్పీడ్ గన్ కెమెరాలతో నమోదు చేసిన ట్రాఫిక్ చలాన్లను క్యాన్సిల్ చేయనున్నట్లు తెలిపారు.

WATCH VIDEO : అలా వచ్చాడు.. ఇలా మాయం చేశాడు.. ఆ తాత ఏమి ఎత్తుకెళ్లాడంటే..!WATCH VIDEO : అలా వచ్చాడు.. ఇలా మాయం చేశాడు.. ఆ తాత ఏమి ఎత్తుకెళ్లాడంటే..!

delhi police decided to cancel traffic challans for some period

అయితే చాలన్ల ఉపసంహరణకు సంబంధించి వాహనదారుల నుంచి ఫిర్యాదులు రావడంతోనే ట్రాఫిక్ పోలీస్ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి సదరు జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన పీడబ్ల్యూడీ సూచిక బోర్డు ప్రకారం వాహనాలు గంటకు 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు. కానీ, 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించిన వాహనాలకు సైతం చలాన్లు విధించడంతో గందరగోళం ఏర్పడింది. దాంతో చాలామంది వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ట్రాఫిక్ పోలీసుల తప్పిదాన్ని కోర్టు దృష్టికి తీసుకెళితే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించి చలాన్ల రద్దు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే చలాన్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారనే వాదనలు వినిపిస్తున్నాయి.

English summary
Delhi Traffic Police have decided to withdraw about one and a half lakh challans issued mostly to those who were found overspeeding on National Highway 24 between August and October 10. However, there is no clarity on what will happen to the amount taken as fines.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X