వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

156 ఏళ్ల క్రితం: ఢిల్లీ పోలీస్ చరిత్రలో మొట్టమొదటి కేసు ఇదే, రూ.3 కోసం!

ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ 19వ శతాబ్దంలో 1861, అక్టోబర్ 18న నమోదైంది.అప్పటి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉంది.ఢిల్లీ పోలీస్ శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ ఎఫ్ఐఆర్ రిప

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఢిల్లీ పోలీస్ స్టేషన్‌లో మొట్టమొదటి ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైందో తెలుసా?. 19వ శతాబ్దంలో 1861, అక్టోబర్ 18న నమోదైనట్లు రికార్డులు చెబుతున్నాయి. అప్పటి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ ఇప్పటికీ అక్కడ భద్రంగా ఉంది.

తాజాగా ఢిల్లీ పోలీస్ శాఖ తమ ట్విట్టర్ ఖాతాలో ఈ ఎఫ్ఐఆర్ రిపోర్టును షేర్ చేసింది. ఉర్దూ భాషలో నమోదైన ఆ ఎఫ్ఐఆర్ పక్కన పోలీసులు ఇంగ్లీషులో వివరణ ఇచ్చారు. 45అణాలు, అంటే రూ.3 విలువ చేసే వంట పాత్ర‌లు, హుక్కా దొంగ‌త‌నానికి గురైనందువల్ల ఈ కేసు నమోదైనట్లు అందులో పేర్కొన్నారు.

క‌త్రా శీశ్ మ‌హ‌ల్ ప్రాంతానికి చెందిన మాయిద్దీన్ వాల్ద్ మ‌హ్మ‌ద్ ఫిర్యాదు మేర‌కు ఉత్త‌ర ఢిల్లీలోని సబ్జీ మండి పోలీసు స్టేష‌న్లో 156 ఏళ్ల క్రితం ఈ కేసు న‌మోదైంది.

'ఢిల్లీ పోలీసు చ‌రిత్ర‌లో కొన్ని అరుదైన జ్ఞాప‌కాలు' పేరుతో ఢిల్లీ పోలీసులు దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఎఫ్ఐఆర్ పత్రాన్ని ఢిల్లీ పోలీస్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచడం విశేషం. అయితే ఈ కేసును అప్పట్లో పోలీసులు చేధించారా? లేదా? అన్నది మాత్రం తెలియరాలేదు.

English summary
Here's a TIL (today I learned) lesson courtesy the Delhi Police. The Twitter handle posted an anecdote about the capital's history all the way from the 19th century.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X