వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా డాన్ (కుక్క)ను వేధిస్తున్నారు: మాజీ మంత్రి

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: మూగజీవి అయిన తన పెంపుడు కుక్క డాన్ ను పోలీసులు పదేపదే వేధిస్తున్నారని మాజీ మంత్రి, ఆప్ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి ఆరోపిస్తున్నారు. విచారణ పేరుతో నా డాన్ ను లాక్కొని వెళుతున్నారని మండిపడ్డారు.

ఆప్ శాసన సభ్యుడు సోమనాథ్ భారతి మీద ఢిల్లీలోని ద్వారాకానాథ్ పోలీసులు గృహ హింస కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో సోమనాథ్ భారతి పెంపుడు కుక్క డాన్ ను పోలీసులు విచారిస్తున్నారు.

విచారణ పేరుతో నిత్యం తనతో పాటు తన డాన్ ను లాక్కొచ్చి మరీ పోలీస్ స్టేషన్ లో విచారణ చేస్తున్నారని సోమనాథ్ భారతి మండిపడుతున్నారు. తనను విచారించి వివరాలు సేకరించినా అర్థం ఉందని, పెంపుడు కుక్క పోలీసులకు ఎలా సమాధానం చెబుతుందని ఆయన ప్రశ్నించారు.

తాను గర్బవతిగా ఉన్న సమయంలో తన భర్త సోమనాథ్ భారతి అతని పెంపుడు కుక్క డాన్ (లబ్రడార్ జాతి కుక్క)ను తన మీదకు వదిలి దాడి చేయించాడని ఆయన భార్య లిపిక మిత్రా పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఈ విషయంపై ఆప్ ప్రభుత్వంలో అలజడి సృష్టించింది. సోమనాథ్ భారతి మీద గృహ హింస, హత్యాయత్నం కేసులు నమోదు అయ్యాయి. అప్పుడు మంత్రిగా ఉన్న సోమనాథ్ భారతి ఆయన పదవికి రాజీనామా చేశారు.

చివరికి సోమనాథ్ భారతి కోర్టులో లొంగిపోయారు. అదే సమయంలో సోమనాథ్ భారతి పెంపుడు కుక్కను పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోమనాథ్ భారతి చెప్పిన మాట ఆయన పెంపుడు కుక్క వినడం లేదని అప్పట్లో పోలీసులు చెప్పిన విషయం తెలిసిందే.

English summary
AAP Delhi MLA Somnath Bharti took to Twitter and said he was directed by police officials to come with his pet.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X