వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.100 కోట్ల బొగ్గు కాంట్రాక్టు రద్దు చేసినందుకు సెయిల్ చైర్మన్ హత్యకు కుట్ర

|
Google Oneindia TeluguNews

నాణ్యతలేని, రూ 100 కోట్ల బొగ్గు కాంట్రాక్టును రద్దు చేసినందుకు ప్రతీకారంగా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ అయినా అనిల్ కుమార్‌ చౌదరి పై హత్యకు కుట్ర పన్నింది బొగ్గు మాఫియా. తనకు వచ్చిన ఒప్పందాన్ని రుద్దు చేయడంతో చైర్మణ్ పై కక్షగట్టిన అశోక్ కమార్ అనే బొగ్గు వ్యాపారీ ఆయన్ను హత్య చేసేందుకు కుట్ర పన్నాడు. ఇందులో భాగంగానే కిరాయి హంతకుల చేత ఆగస్టు 7వ తేదీన అనిల్ కుమార్‌పై దాడి చేయించాడు. అయితే అదృష్ట వశాత్తు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోవడంతో ఆయన తీవ్రగాయలతో ప్రమాదం నుండి బయటపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కేసును చేదించిన పోలీసులు హత్యకు కుట్ర పన్నిన ఆశోక్‌ కమార్‌ను అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి ఊర్మిళ ...!కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నటి ఊర్మిళ ...!

 100 కోట్ల బొగ్గు ఒప్పందాన్ని రద్దు చేసిన సెయిల్ చైర్మణ్

100 కోట్ల బొగ్గు ఒప్పందాన్ని రద్దు చేసిన సెయిల్ చైర్మణ్

నిందితుడు అశోక్ కుమార్ కుమారుడి చెందిన కంపనీకి సెయిల్‌కు మధ్య రూ. 100 కోట్ల బొగ్గు సరఫరా ఒప్పందం కుదిరింది. ఇందుకోసం సెయిల్ 30 కోట్ల రుపాయల అడ్వాన్స్‌ను కూడ చెల్లించింది. అయితే ఒప్పందం ప్రకారం కాకుండా నాణ్యత లేని బోగ్గును పంపీణి చేశారు. దీంతో సెయిల్ చైర్మణ్ అయిన అనిల్ కుమార్ చౌదరీ రిజెక్ట్ చేశాడు. దీంతో పాటు ఇద్దరి మధ్య 100 కోట్ల రుపాయల బొగ్గు కాంట్రాక్టును కూడ రద్దు చేశాడు. దీంతో ఆయనపై కక్ష పెంచుకున్న అశోక్ కమార్ చైర్మణ్ పై దాడికి కుట్ర లేపాడు.

ఒప్పందం రద్దుతో కక్ష పెంచుకున్న అశోక్ కుమార్

ఒప్పందం రద్దుతో కక్ష పెంచుకున్న అశోక్ కుమార్

ఈనేపథ్యంలోనే గత నెల ఆగస్టు ఏడున కారులో వెళుతున్న ఆయన్ను కొంతమంది కిరాయి దుండగులు అడ్డగించారు. ఆయన కారును మరో కారుతో డీకొట్టి ఆపారు. దీంతో కారులో నుండి బయటకు వచ్చిన అనిల్ కుమార్‌పై దాడి చేశారు. ముగ్గురు వ్యక్తులు ఆయనతో పాటు డ్రైవర్‌ను కదలకుండా పట్టుకున్నారు. మరో ఇద్దరు దాడి చేశారు. రాడ్డుతో తలతోపాటు కాళ్లు, మోకాళ్లపై దాడి చేశారు. దీంతో ఆయనకు శరీరంలో పలు గాయలు అయ్యాయి. అయితే అదే సంధర్భంలో పెట్రోలింగ్‌‌లో భాగంగానే అక్కడికి చేరుకున్న పోలీసులు దాడి సంధర్భంలోనే ఇద్దరు దుండగులను పట్టుకున్నారు. అయితే మరి కొంతమంది అక్కడి నుండి పారిపోయారు.

దాడి చేసి, చంపేందుకు 6 లక్షలు, 2 లక్షల అడ్వాన్స్,

దాడి చేసి, చంపేందుకు 6 లక్షలు, 2 లక్షల అడ్వాన్స్,

కాగా సెయిల్ చైర్మణ్ అనిల్ కుమార్‌ను చంపేందుకు ఆరు లక్షల రుపాయల ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఇందుకోసం 2 లక్షల రుపాయాలను కూడ చెల్లించారు. కాగా అనిల్ కుమార్‌పై దాడి చేసిన నేపథ్యంలోనే ఆయన తనను చంపేందుకు కుట్ర జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు. బొగ్గు మాఫియా అరెస్ట్‌తో ఇది నిరూపించబడిందని అన్నారు. దాడిలో అంతర్గతంగా గాయాలపాలయ్యాయని మీడీయాకు తెలిపాడు. ఆయన కొలుకునేందుకు మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉందని పీటిఐకి ఇచ్చిన ఇంటర్యూలో ఆయన పేర్కోన్నారు.

English summary
Delhi Police's Crime Branch has cracked the case of the attack on SAIL Chairman Anil Kumar Chaudhary last month. Police have arrested coal mafia and contractor AK Singh in connection with the attack.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X